
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Krishi Thapanda First Statement over vaishak Found Dead tragedy: బిగ్ బాస్ ఫెమ్ కన్నడ నటి కృషి తాపండ బెంగళూరులోని రాజరాజేశ్వరీ నగర్ నివాసంలో ఇటీవల వైశాఖ్ అనే బిజినెస్ మెన్ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొలుత దీనిపై రకరకాల ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో కొంత మంది వైశాఖ్ , కృషి తాపండ మధ్య అఫైర్ నడుస్తుందని ప్రచారం చేశారు. మరికొంత మంది కృషి తాపండ కోసం తన కుటుంబంతో కూడా వైశాఖ్ దూరంగా నటి ఇంట్లో ఉంటున్నాడని, ఏదో గొడవలతో ఈ విధంగా సూసైడ్ చేసుకుని ఉండొచ్చని ప్రచారం చేశారు. మొత్తంగా ఈ రూమర్స్ పై నటి కృషి తాపండ స్పందించారు. ఈ క్రమంలో తన ఇన్ స్టాలో భావొద్వేగంతో కూడిన పోస్ట్ ను పెట్టారు.
గత కొన్ని రోజులుగా తాను తన క్లోజ్ ఫ్రెండ్ వైశాఖ్ సూసైడ్ పై చాలా బాధలో ఉన్నానని చెప్పుకొచ్చారు. కానీ కొంత మంది మాత్రం దీనిపై లేనిపోని రూమర్స్, అసత్య కథనాలు రాస్తున్నారని ఎమోషనల్ అయ్యారు . మొదట్లో దీనిపై పెద్దగా స్పందించకూడదని భావించినట్లు చెప్పారు. కానీ మౌనంగా ఉంటే వారు వ్యాప్తి చేస్తున్న వదంతులు, ఊహగానాలు నిజం అనుకునే సిట్యువేషన్ ఉండటం వల్ల క్లారిటీ ఇచ్చేందుకు స్పందించాల్సి వచ్చిందన్నారు.
అసలు తాను ఇలాంటి పోస్ట్ పెడతానని ఎన్నడు అనుకొలేదన్నారు . మానసికంగా చాలా కుంగిపోయి ఉన్నానని చెప్పారు. తన క్లోజ్ ఫ్రెండ్ చనిపోయాడని దయచేసి అందరిని శాంతిగా ఉండనివ్వండని చేతులు జోడించి వేడుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటికే తన హృదయానికి అత్యంత సన్నిహితుడైన,అన్ని విషయాల్లో అండగా నిలిచి, నన్ను రక్షించిన వ్యక్తిని కోల్పోయిన బాధలో ఉన్నట్లు చెప్పారు.
నాకు జరిగిన ఈ నష్టాన్ని నేను ఎప్పటికీ పూర్తిగా జీర్ణించుకోగలనో లేదో నాకు తెలియడం లేదని భావొద్వేగంకు గురయ్యారు. చాలా కాలంగా ఎవరితో కూడా పంచుకొలేని మానసిక భారంను అనుభవిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తమపై, కుటుంబంపై వస్తున్న ఈ వదంతులు, ఊహాగానాలు తమ బాధను మరింత ఎక్కువ చేస్తున్నాయన్నారు. దయచేసి ఇప్పటికైన వదంతులు, ఊహగానాలు మానుకొవాలన్నారు.
ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు. కొడుకును కోల్పోయిన కుటుంబం ఒకటి ఉంటే, మాటల్లో చెప్పలేనంతగా ప్రేమించిన వారిని కోల్పోయిన స్నేహితులు మరోకరు ఉన్నారని రాసుకొచ్చింది. మీరు ఒకరి ముఖంలో చిరునవ్వు తీసుకురాలేకపోతే, కనీసం వారి కన్నీళ్లకు కారణం కాకండి.
Read more: Krishi Thapanda: కన్నడ నటి, బిగ్ బాస్ ఫెమ్ నివాసంలో డెడ్ బాడీ కలకలం.. అసలేం జరిగిందంటే..?
మీరు ఒకరికి బ్రతకడానికి ఒక కారణం ఇవ్వలేకపోతే, కనీసం వారు ఆశ కోల్పోవడానికి కారణం కావొద్దని నటి కృషి తాపండ చాలా ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టారు. వైశాఖ్‌ను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకెళ్ళాలని.. ఇంకా మీ వదంతులతో అశాంతిని రగల్చవద్దని వేడుకుంటూ నటి కృషి తాపండ ఇన్ స్టాలో భావొద్వేగ సందేశం పెట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.