
ఈ జ్యూస్ షుగర్ బాంబ్తో సమానం.. రోజూ తాగొద్దుఈ జ్యూస్ షుగర్ బాంబ్తో సమానం.. రోజూ తాగొద్దు 28 June 2026 TV9 Telugu TV9 Telugu గ్లాసుడు చెరకు రసంలో సుమారు 25 నుంచి 30 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది.
ఇది దాదాపు ఐదు నుంచి ఆరు టీ స్పూన్ల చక్కెరకు సమానం ఇందులో ప్రధానంగా సుక్రోజ్ ఉండగా, కొద్దిపాటి గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కూడా ఉంటాయి. చక్కెర ద్రవరూపంలో ఉండటం వల్ల అది రక్తప్రసరణలోకి చాలా వేగంగా చేరుతుంది దీంతో శరీరానికి తక్షణ శక్తి లభించి చల్లదన అనుభూతి చెందుతారు. అందుకే వేసవిలో చెరకు రసం తాగిన వెంటనే ఉల్లాసంగా అనిపిస్తుంది. అయితే దీనిని రోజూ తీసుకోకూడదు చెరకు రసంలో పొటాషియం, పాలీఫినాల్స్ వంటి కొన్ని పోషకాలు కూడా ఉంటాయి. పొటాషియం శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది పాలీఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వేడి వాతావరణంలో ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. అయితే చెరకు రసాన్ని ప్రతిరోజూ తీసుకోవడం అంత మంచిది కాదట మొత్తం చెరకు ముక్కలో ఉండే పీచు పదార్థం రసంలో చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ కూడా ఉండదు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు ఒక్కసారిగా పెరుగుతాయి TV9 Telugu రక్తంలో చక్కెర వేగంగా పెరగడం వల్ల కొంతసేపు అధిక శక్తి లభించినట్లు అనిపించినా, ఆ తర్వాత శక్తి స్థాయి అకస్మాత్తుగా తగ్గిపోతుంది. దీంతో అలసట ఆవహిస్తుంది TV9 Telugu ఇన్సులిన్ రెసిస్టెన్స్, మధుమేహం లేదా యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలతో బాధపడుతున్న వారు చెరకు రసాన్ని తరచూ తీసుకోవడాన్ని నివారించడం మంచిది మరిన్ని వెబ్ స్టోరీస్ చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్ కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది? పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి