
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
FIFA World Cup 2026 Round of 32 fixtures: ఫిఫా వరల్డ్ కప్ 2026 విజయవంతంగా ముందుకు సాగుతోంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్త వేదికలుగా ఈ నెల 12వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నమెంట్ అభిమానులకు మస్తు మజానిస్తుంది. అయితే ఈ టోర్నీలో ఆదివారంతో కీలక గ్రూప్ దశ ముగిసిందని చెప్పాలి. దీంతో టోర్నమెంట్ ఇప్పుడు నాకౌట్ దశకు చేరింది. 48 జట్లతో ప్రారంభమైన లీగ్ లో 16 జట్లు ఎలిమినేట్ అయ్యాయి. దీనిలో మిగిలిన జట్లు రౌండ్ ఆఫ్ 32 దశకు అర్హత సాధించాయి. మరి ఈ రౌండ్ ఫార్మాట్, ఫుల్ షెడ్యూల్ ఎలా ఉందో చూద్దాం.
16 జట్లు ఇప్పటికే గ్రూప్ దశ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. వీటిలో దక్షిణ కొరియా, చెక్ రిపబ్లిక్, ఖతార్, స్కాట్లాండ్, హైతీ , టర్కీ, న్యూజిలాండ్, ఇరాన్, ట్యునీషియా, కురసోవో, ఉరుగ్వే, ఇరాన్, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్, పనామా జట్లు టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్లాయి. మిగిలిన 32 జట్లు నెక్ట్స్ లెవల్ కు అర్హత సాధించాయి.
రౌండాఫ్ 32లో 32 జట్లు ఒక్కో మ్యాచ్ మాత్రమే ఆడుతాయి. ఈ మ్యాచులన్నీ డూ ఆర్ డై తరహాలోనే ఉంటాయి. ఓడిపోయిన జట్లకు ఇక్కడ మరో ఛాన్స్ ఉండదు. అవి నేరుగా టోర్నీ నుంచి వైదొలుగుతాయి. ఆవిధంగా అందులో నుంచి 16 జట్లు బయటకు వెళ్లగా మిగిలిన 16 జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత 16 జట్లు ఒక్కో మ్యాచ్ ఆడుతాయి. దానిలో నుంచి 8 జట్లు క్వార్టర్ ఫైనల్.. అక్కడ నెగ్గిన 4 జట్లు సెమీ ఫైనల్ మ్యాచ్ లు ఆడుతాయి. రెండు సెమీస్ ల్లో నెగ్గిన జట్లు ఫైనల్ కు అర్హత సాధిస్తాయి.
ఏకకాలంలో జరిగే పలు గ్రూప్-స్టేజ్ మ్యాచ్‌లు జీ5 యాప్, వెబ్సైట్లో ప్రసారం చేస్తాయి. ఫీఫా ప్రపంచ కప్ 2026 ప్రత్యక్ష ప్రసారం భారతదేశంలోని యునైట్8 స్పోర్ట్స్ 1, యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్డి, యునైట్8 స్పోర్ట్స్ 2, యునైట్8 స్పోర్ట్స్ 2 హెచ్డి టీవీ ఛానెళ్లలో కూడా అందుబాటులో ఉంటుంది.
రౌండ్ ఆఫ్ 32కు చేరిన జట్లు గ్రూప్ A: మెక్సికో, దక్షిణాఫ్రికా గ్రూప్ B: స్విట్జర్లాండ్, కెనడా, బోస్నియా, హెర్జెగోవినా గ్రూప్ C: బ్రెజిల్, మొరాకో గ్రూప్ D: అమెరికా, ఆస్ట్రేలియా, పరాగ్వే గ్రూప్ E: జర్మనీ, ఐవరీ కోస్ట్, ఈక్వెడార్ గ్రూప్ F: నెదర్లాండ్స్, జపాన్, స్వీడన్ గ్రూప్ G: బెల్జియం, ఈజిప్ట్ గ్రూప్ H: స్పెయిన్, కాబో వెర్డే గ్రూప్ I: ఫ్రాన్స్, నార్వే, సెనెగల్ గ్రూప్ J: అర్జెంటీనా, ఆస్ట్రియా, అల్జీరియా గ్రూప్ K: కొలంబియా, పోర్చుగల్, డీఆర్ కాంగో గ్రూప్ L: ఇంగ్లాండ్, ఘానా, క్రొయేషియా 32వ రౌండ్ మ్యాచ్ షెడ్యూల్
దక్షిణాఫ్రికా vs కెనడా మ్యాచ్ ముగిసింది (కెనడా నెగ్గింది) బ్రెజిల్ vs జపాన్: జూన్ 29, రాత్రి 10:30 జర్మనీ vs పరాగ్వే: జూన్ 30, మధ్యాహ్నం 2:30 ఉదయం నెదర్లాండ్స్ vs మొరాకో: జూన్ 30, ఉదయం 6:30 ఐవరీ కోస్ట్ vs నార్వే: జూన్ 30, రాత్రి 10:30 ఫ్రాన్స్ vs స్వీడన్: జూలై 1, ఉదయం 2:30 మెక్సికో vs ఈక్వెడార్: జూలై 1, ఉదయం 6:30 ఇంగ్లాండ్ vs డిఆర్ కాంగో: జూలై 1, రాత్రి 9:30 బెల్జియం vs సెనెగల్: జూలై 2, ఉదయం 1:30 యుఎస్ఏ vs బోస్నియా: జూలై 2, ఉదయం 5:30 స్పెయిన్ vs ఆస్ట్రియా: జూలై 3, అర్ధరాత్రి 12:30 పోర్చుగల్ vs క్రొయేషియా: జూలై 3, ఉదయం 4:30 స్విట్జర్లాండ్ vs అల్జీరియా: జూలై 3, అర్ధరాత్రి 12:30 ఆస్ట్రేలియా vs ఈజిప్ట్: జూలై 3, రాత్రి 11:30 అర్జెంటీనా vs కేప్ వెర్డే: జూలై 4, ఉదయం 3:30 కొలంబియా vs ఘనా: జూలై 4, ఉదయం 7:00
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.