
Pakistan-Afghanistan| ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతికి తామే కారణమని ఎగిరిగంతులేస్తున్న పాకిస్థాన్.. పొరుగుదేశంతో మాత్రం తరచూ కయ్యానికి కాలుదువ్వుతోంది.
జనావాసాలను లక్ష్యంగా చేసుకుంటూ ప్రపంచానికి మాత్రం ఉగ్రవాదులను మట్టుపెట్టామని అసత్యాలు చెబుతోంది. తాజాగా ఎరేసి, సహాయక బృందాలను ట్రాప్ చేసి దాడులు చేసింది. అర్ధరాత్రి తర్వాత అఫ్ఘాన్ సరిహద్దులో పాక్ జరిపిన దాడుల్లో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం..
అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో పాక్ ఎయిర్‌ఫోర్స్ (PAF) అఫ్గాన్ సరిహద్దు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ తర్వాత పాక్ ఒక వ్యూహాన్ని అనుసరించింది. గాయపడిన, చిక్కుకుపోయిన వారిని కాపాడుకునేందుకు గ్రామస్థులు వచ్చిన సమయంలో పాక్ (Pakistan) విమానాలు రెండోసారి బాంబులు వేశాయి. 25 నిమిషాల వ్యవధిలో రెండుసార్లు పాక్ దాడి చేసింది. ఉద్దేశపూర్వకంగా చేసిన ఈ దాడితో (దీనినే డబుల్ టాప్ అంటారు) మృతుల సంఖ్య భారీగా పెరిగి, 35కి చేరింది. వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు.
తండ్రి అంత్యక్రియలు.. మొజ్తాబా ఖమేనీ ఇకనైనా కనిపిస్తారా..?
ఖైబర్ పఖ్తుంక్వా, బలూచిస్థాన్, కరాచీలోని పాకిస్థాన్ రేంజర్స్ క్యాంప్‌పై ఇటీవల జరిగిన పలు ఉగ్రదాడులకు ప్రతీకారం తీర్చుకున్నామని పాక్ సమాచార శాఖ మంత్రి ఎక్స్ వేదికగా వెల్లడించారు. గతవారం కరాచీలో జరిగిన దాడిలో ముగ్గురు పారామిలిటరీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అత్యంత కచ్చిత్వంతో తాము జరిపిన దాడుల్లో మూడు లక్ష్యాలు ధ్వంసమైనట్లు మంత్రి వెల్లడించారు. ఈ వైమానిక దాడులను అఫ్గాన్ (Afghanistan) ఖండించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.