
తెలంగాణలో రైల్వే ప్రగతి పరుగులు పెడుతోంది. ఇప్పటికే వందే భారత్ వంటి అధునాతన రైళ్ళ సౌకర్యంతో ఉన్న తెలంగాణాలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు అమలు దిశగా కీలక అడుగులు పడుతున్నాయి.
హైదరాబాద్ నుంచి చెన్నై మరియు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వేళ క్షేత్రస్థాయి సర్వే పనులు వేగంగా కొనసాగుతున్నాయి.బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం సర్వే బృందాలు మార్కింగ్ రంగారెడ్డి జిల్లాలోని యాచారం, శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు మండలాల్లో సర్వే బృందాలు ప్రత్యేక గుర్తులు వేస్తున్నాయి. హైదరాబాద్-చెన్నై కారిడార్ నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వైపు మరియు హైదరాబాద్-బెంగళూరు కారిడార్ షాబాద్ మండలం మీదుగా ఈ పనుల సర్వే జరుగుతోంది. పొలాలు, ఇతర ప్రాంతాల్లో ఎరుపు-తెలుపు రంగులతో మార్కింగ్ చేస్తున్నారు.హైస్పీడ్ రైలు కారిడార్ ఎలైన్‌మెంట్‌ను ఖరారుయాచారం మండలంలోని కురుమిద్ద, మేడిపల్లి, మంకీస్‌గూడెం, తక్కళ్లపల్లి, చింతపట్ల, నల్లవెల్లి, మందన, గౌరెల్లి వంటి గ్రామాల్లో ఇప్పటికే మార్కింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ మార్కింగ్ పనులు హైస్పీడ్ రైలు కారిడార్ ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం, సర్వే పాయింట్లు గుర్తించడం మరియు భూసేకరణ అవసరాలను అంచనా వేయడానికి ఉపయోగపడతాయి.తుది ఎలైన్‌మెంట్, స్టేషన్ల స్థానాలు, భూసేకరణ వివరాల కోసం సర్వేఇంతకు ముందు ఏరియల్ సర్వే నిర్వహించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేశారు. ప్రస్తుతం క్షేత్రస్థాయి సర్వే ద్వారా రూట్‌ను ఖరారు చేసే ప్రక్రియ వేగవంతం అవుతోంది. సర్వే పూర్తి అయిన తర్వాత తుది ఎలైన్‌మెంట్, స్టేషన్ల స్థానాలు, భూసేకరణ వివరాలు స్పష్టం అవుతాయి. అప్పుడు వేగంగా పనులు సాగించటానికి అవకాశం ఉంటుంది. ఈ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు తెలంగాణ రవాణా రంగాన్ని ఆధునికీకరించి, ఆర్థిక అభివృద్ధికి ఊతం ఇవ్వనుంది.ఇడుపుకాయితం అర్ధం పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు.. ఆయన్ను అడగండి: కవిత తెలంగాణను జాతీయ హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌లో భాగం చేయటమే లక్ష్యం దీంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి, వాణిజ్యం, పర్యాటకం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు అమలు దశలో స్థానికులు, రైతులతో సమన్వయం చేసుకొని భూసేకరణ ప్రక్రియను సాఫీగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టు తెలంగాణను జాతీయ హైస్పీడ్ రైలు నెట్‌వర్క్‌లో భాగం చేసి రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తుందని ఆశిస్తున్నారు.