
మనీ ప్లాంట్ పెంచుతున్నారా?.. ఈ తప్పులు అస్సలు చేయకండి! లేదంటేమనీ ప్లాంట్ పెంచుతున్నారా?.. ఈ తప్పులు అస్సలు చేయకండి! లేదంటే?
29 Jun 2026 Anand T మనీ ప్లాంట్ ఇది మన ఇంటికి అందంతో పాటు సానుకూలతను తెచ్చిపెట్టే అందమైన మొక్క. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ ఈ మొక్క కనిపిస్తుంది.
అయితే ఈ మొక్కకు సరైన సరక్షణ లేకపోతే ఆకులు పసుపు రంగులోకి మారి, మొక్క వాడిపోయే ప్రమాదం ఉంది.
మనీ ప్లాంట్లు ఆకులు పసుపు రంగులోకి మారడానికి ప్రధాన కారణం నీరు ఎక్కవగా పోయడం. మీరు ఎప్పుడూ ఈ తప్పు చేయకండి మనీ ప్లాంట్ ఆరోగ్యంగా పెరగాలంటే వారానికి కేవలం రెండు నుండి మూడు సార్లు మాత్రమే నీరు పోయడం ఉత్తమం.
మొక్క పెరగడానికి కాంతి అవసరమే, కానీ ప్రత్యక్ష సూర్యరశ్మి పడితే ఆకులు త్వరగా కాలిపోయి రంగు మారుతాయి.
మీ మనీ ప్లాంట్ను నేరుగా ఎండ పడకుండా... ఇంటి లోపల, కిటికీ దగ్గర లేదా నీడ ఉన్న ప్రదేశంలో ఉంచడం చాలా మంచిది.
మొక్కను నాటే కుండీకి కింద నీరు బయటకు పోవడానికి ఖచ్చితంగా రంధ్రాలు ఉండాలి. లేదంటే నీరు నిలిచిపోయి వేర్లు కుళ్ళిపోతాయి.
మొక్క ఎప్పుడూ పచ్చగా, బలంగా పెరగడానికి ఎండిపోయిన, పసుపు రంగులోకి మారిన ఆకులను, కాండాలను క్రమం తప్పకుండా కత్తిరిస్తూ ఉండాలి.
సరైన మోతాదులో నీరు, నీడ, కాస్త సంరక్షణ ఉంటే మీ ఇంట్లోని మనీ ప్లాంట్ ఎల్లప్పుడూ పచ్చగా, అందంగా కళకళలాడుతుంది. జాగ్రత్తలు మరిన్ని వెబ్ స్టోరీస్ తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా? రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్