
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు భాజపాపై నమ్మకముందని.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు.
ఆ నమ్మకాన్ని పార్టీ బూత్ అధ్యక్షులు ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో భాజపా బూత్ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ సహకారంతో భాగ్యనగరానికి విముక్తి కలిగింది. తెలంగాణ ఏర్పాటుకు భాజపా కూడా పోరాడింది. పార్లమెంట్లో సుష్మాస్వరాజ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం గళమెత్తారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఆ పార్టీపై వ్యతిరేకతతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తోంది. తెలంగాణ అభివృద్ధి డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే సాధ్యం. కాంగ్రెస్‌ది భారతీయ ఆలోచన కాదు.. ఇటలీ ఆలోచన. 2028లో తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పడుతుంది. నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాహసోపేతమైన నిర్ణయాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలి. వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి సమన్వయంతో పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పనిచేయాలి’’ అని నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కలిసినా హైదరాబాద్ భాజపా అడ్డా అన్నారు. రానున్న ఎన్నికల్లో మూడు కార్పొరేషన్లనూ కైవసం చేసుకుంటామని చెప్పారు. నగరంలో చిన్నపాటి వర్షాలకే రోడ్లు నదులను తలపిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల ఓట్లతో కార్పొరేషన్లు దక్కించుకోవాలని మజ్లిస్ కుట్ర పన్నుతోందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మోడలింగ్.. అదో కళల ప్రపంచం. చాలామంది యువత అందులో రాణించాలని కోరుకుంటారు.
అందరికీ వానాకాలం వరమైతే.. ఆ కాలనీలకు మాత్రం శాపంలా మారుతోంది. వరదల నుంచి ఎలా గట్టెక్కాలని ఆ ప్రాంత వాసులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.