
మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న అత్యంత కీలకమైన గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు సాధించింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (56) మెరుపు హాఫ్ సెంచరీతో కదం తొక్కడంతో, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (38), షఫాలీ వర్మ (34) కూడా రాణించి జట్టుకు బలమైన పునాది వేశారు.లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు స్మృతి, షఫాలీ ఆచితూచి ఇన్నింగ్స్ ప్రారంభించినా, కాసేపటికే దూకుడు పెంచారు. ముఖ్యంగా షఫాలీ వర్మ భారీ షాట్లతో అలరించింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, మంచి ఊపుమీదున్న షఫాలీ పదో ఓవర్లో ఔట్ కాగా, కొద్దిసేపటికే స్మృతి మంధాన దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగింది.ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్ (34)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. మొదట నిలకడగా ఆడిన హర్మన్, డెత్ ఓవర్లలో విశ్వరూపం ప్రదర్శించింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది కేవలం 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. మొత్తంగా 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 56 పరుగులు చేసి చివరి బంతికి ఔటైంది. జెమీమా కూడా చివరిలో వేగంగా ఆడి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగింది. సెమీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందు భారత్