
ఆంధ్రప్రదేశ్‌లో తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. రైతులను ఆదుకునేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్...
ఆంధ్రప్రదేశ్‌లో తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. రైతులను ఆదుకునేందుకు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని, కేంద్రం అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల మార్కెట్ పరిస్థితుల కారణంగా మామిడి గుజ్జు (పల్ప్) ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయని చంద్రబాబు తన లేఖలో వివరించారు. దీని ప్రత్యక్ష ప్రభావంతో స్థానిక మార్కెట్లలో తోతాపురి మామిడి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయని, దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ క్లిష్ట పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే సహాయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సుమారు 7.03 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడిని రైతుల నుంచి సేకరించేందుకు రూ. 281 కోట్లు ఆర్థిక సహాయంగా మంజూరు చేయాలని కోరారు. దీంతో పాటు, మార్కెట్ ధరకు, గిట్టుబాటు ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేసేలా ప్రత్యేకంగా 'ధరల వ్యత్యాస చెల్లింపు పథకం' (Price Deficiency Payment Scheme) అమలు చేయాలని సూచించారు.