
లక్నో: ప్రస్తుతం దేశంలో అయోధ్య రామాలయ హుండీలో విరాళాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన నేరస్థుల లైఫ్ స్టైల్‌పై ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Jun 28 2026 6:01 PM | Updated on Jun 28 2026 6:09 PM
లక్నో: ప్రస్తుతం దేశంలో అయోధ్య రామాలయ హుండీలో విరాళాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన నేరస్థుల లైఫ్ స్టైల్‌పై ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారి గ్రామంలో ఈ విషయమై పోలీసులు విచారణ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
అయోధ్య రామాలయ హుండీ విరాళాల చోరీ కేసులో పోలీసులు ఇదివరకే ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇందులో ఒకే కుటుంబానికి చెందిన అనుకల్ప్ మిశ్రా, అతని బావ లవకుష్ మిశ్రా ఉన్నారు. అయితే అనుకల్పే మాస్టర్‌మైండ్ ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. తాజాగా అయోధ్య పరిసరాల్లోని ఆయన గ్రామాన్ని సందర్శించగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
అయోధ్య సమీపంలోని అతని గ్రామమైన బసవాకు పోలీసులు విచారణ నిమిత్తం వెళ్లారు. ఇతరుల ఇళ్లతో పోలిస్తే ఇళ్లతో పోలిస్తే అతని ఇల్లు చాలా విభిన్నంగా అత్యంత విలాసవంతమైనదిగా కనిపించినట్లు పేర్కొన్నారు. ఆ విషయమై వారి ఇంటి పరిసరాల్లోని వ్యక్తులను విచారించగా ఒక్కసారిగా వారి ఆర్థిక స్థితిలో పెనుమార్పులు వచ్చినట్లు తెలిపారు.
అంతేకాకుండా అనుకల్ప్ మిశ్రా ఇటీవల గ్రామం వెలుపల ఒక ఫార్మ్‌హౌస్ నిర్మించాడని గత ఏడాది అయోధ్యలో రూ. 65 లక్షలు వెచ్చించి ఒక ఇల్లు కొనుగోలు చేశాడని అతని వద్ద ఇప్పటికే ఒక వాహనం ఉండగా, కొత్తగా స్కొర్పియో ఎస్యూవీ బుక్ చేశాడని పేర్కొన్నారు.
కొద్దిరోజుల క్రితం వరకు ఆ కుటుంబం తీవ్రమైన "ఆర్థిక ఇబ్బందుల్లో" ఉండేదని, కానీ ఇప్పుడు వారికి ఎటువంటి లోటులేదని ఆర్థికంగా చాలా బలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవలే అనుకల్ప్ ఒక ప్రసిద్ధ మత ప్రవచనకర్త (కథావాచక్) తో ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించాడని అతని బంధువులు తెలిపినట్లు పేర్కొన్నారు.
ఒక బ్యాంకు అవుట్సోర్సింగ్ టీమ్‌లో పనిచేసే మిశ్రా, దాదాపు మూడేళ్ల క్రితం రామాలయ విరాళాల లెక్కింపు బృందంలో చేరాడు. ఆ తర్వాత అదే బ్యాంక్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా తన బావ లవకుష్ మిశ్రాను కూడా అదే టీమ్‌లోకి తీసుకువచ్చాడు.అయోధ్యలోని రుదౌలీ ప్రాంతానికి చెందిన లవకుష్ మిశ్రా ప్రస్తుతం ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అతను కూడా ఇటీవల లక్ష రూపాయలకు పైగా విలువైన బైక్‌ను కొనుగోలు చేసినట్లు పొరుగువారు తెలిపారు.
టాలీవుడ్ హీరోయిన్ బేబీ షవర్ సెలబ్రేషన్ (ఫొటోలు)
'ప్రేమమ్' హీరోయిన్ గోల్టెన్ బ్యూటీ (ఫొటోలు)
ఒకప్పటి హీరోయిన్ మధుబాల.. ఖుష్బూ కూతురి పెళ్లిలో ఇలా (ఫొటోలు)
చీరలో సింగారించుకుని అందంగా అనసూయ (ఫొటోలు)
మా పైనే కేసులు పెడతారా.. టీడీపీ గుండాల దాడి పై అంబటి రాంబాబు ప్రెస్ మీట్
YSRCP నేతలపై హత్యాయత్నం.. శాంతిభద్రతలు అదుపు తప్పాయి
కేతన్ కేసులో రోజుకో ట్విస్ట్.. నిండు ప్రాణం తీసిన సియా మౌనం
రాకెట్ స్పీడ్ లో దూసుకెళ్లిన ఓలా ఎలక్ట్రిక్, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్స్ ..