
ముంబైలోని కాంగ్రెస్ హౌస్... ఒకప్పుడు స్వాతంత్య్రోద్యమానికి గుండెకాయలాంటిది. మహాత్మా గాంధీ, నెహ్రూ వంటి మహానాయకులు అడుగుపెట్టిన పవిత్ర స్థలం.
కానీ కాలక్రమేణా ఆ చారిత్రక ప్రాధాన్యం మసకబారి, ఇప్పుడది ఓ వ్యభిచార కేంద్రంగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఈ చారిత్రక కట్టడం గురించి తెలియని వారు, దానిని వ్యభిచార గృహంగా పొరబడుతున్నారు.అసలేం జరిగింది?దక్షిణ ముంబైలోని గ్రాంట్ రోడ్ సమీపంలో ఉన్న ఈ కాంగ్రెస్ హౌస్కు ఎదురుగా, కేవలం 20 అడుగుల దూరంలోనే 'ఎన్బీ కాంపౌండ్' అనే రెడ్ లైట్ ఏరియా ఉంది. ఇది ముంబైలోని పురాతన ముజ్రా కేంద్రాల్లో ఒకటి. ఈ రెండు ప్రదేశాలు అత్యంత సమీపంలో ఉండటంతో, చాలామంది ఈ రెండిటినీ ఒకే ప్రదేశంగా భావిస్తున్నారు. ట్యాక్సీ డ్రైవర్ల నుంచి స్థానికుల వరకు చాలామంది ఆ రెడ్ లైట్ ఏరియానే 'కాంగ్రెస్ హౌస్' అని పిలవడం మొదలుపెట్టారు.చరిత్ర వర్సెస్ వర్తమానంవాస్తవానికి కాంగ్రెస్ హౌస్ అనేది ఒక చారిత్రక భవనాల సముదాయం. క్విట్ ఇండియా ఉద్యమం సహా ఎన్నో కీలక సమావేశాలకు ఇది వేదికైంది. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మహమ్మద్ అలీ జిన్నా, సరోజినీ నాయుడు వంటి ప్రముఖులు ఇక్కడ సమావేశమయ్యేవారు. అలాంటి ప్రాధాన్యం ఉన్న ఈ భవన సముదాయంలో ప్రస్తుతం 80కి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. చారిత్రక భవనానికి పట్టిన ఈ దుస్థితి వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యభిచారం కోసం వచ్చే పురుషులు నేరుగా ఇళ్ల తలుపులు తట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టడంతో అక్కడి నివాసితులు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు