అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు క్రితం రోజు భారీగా పెరిగి ఈరోజు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 4071 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 58.
92 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత రెండు రోజుల్లో భారీగా పెరిగి ఇవాళ అదే ధర వద్ద ఉన్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ.1,43,950 వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.1,31,950 వద్ద అమ్ముడవుతోంది.
బంగారం ధర నిన్నటి రోజున భారీగా పెరిగినా వెండి మాత్రం స్థిరంగానే ఉంది. వరుసగా రెండో రోజూ వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,45,000 మార్క్ వద్ద అమ్ముడవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జువెలరీల్లో ఒకటైన లలితా జువెలరీల్లో ఈరోజు బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 1 గ్రాముకు రూ. 13,195 వద్ద ఉంది. ఇక తులం రేటు అంటే 10 గ్రాముల లెక్క చూస్తే రూ.1,31,950 పలుకుతోంది.
రచయిత గురించిబండ తిరుపతిబండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2023లో సమయంలో చేరిన తిరుపతి.. బిజినెస్ రంగానికి సంబంధించి తాజా వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్డేట్లు అందిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్‌తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం ఇస్తున్నారు. బండ తిరుపతి 2025 ఫిబ్రవరిలో టైమ్స్ ఇంటర్నెట్ నుంచి ఓవర్ అచీవర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నారు. తిరుపతి మండలస్థాయి న్యూస్ కంట్రిబ్యూటర్‌గా తన జర్నలిజం కెరీర్‌ను ప్రారంభించారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. అక్కడ బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ రాశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు అందించిన అనుభవం ఉంది. సినిమాలు, క్రికెట్ చూడటం, బిజినెస్ రంగానికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆయన ఆసక్తి చూపుతారు.... ఇంకా చదవండి