
FIFA World Cup 2026 : ఫిఫా వరల్డ్ కప్ 2026లో అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ జోరు మీదున్నాడు. తన అద్భుతమైన ఫామ్‌తో మైదానంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు.
గ్రూప్ దశలో జోర్డాన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో మెస్సీ ఒక చారిత్రాత్మక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలోనే వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో గోల్స్ సాధించిన ప్రపంచపు మొట్టమొదటి ఆటగాడిగా మెస్సీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మెస్సీ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అర్జెంటీనా 3-1 తేడాతో జోర్డాన్‌ను దారుణంగా ఓడించి, ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని (హ్యాట్రిక్ విక్టరీ) నమోదు చేసింది.
ఈ మ్యాచ్ 80వ నిమిషంలో అర్జెంటీనాకు ఒక సువర్ణావకాశం లభించింది. పెనాల్టీ బాక్స్ వెలుపల జోర్డాన్ డిఫెండర్లు చేసిన తప్పిదానికి రెఫరీ ఫ్రీ కిక్ ఇచ్చాడు. ఆ సమయంలో మెస్సీ కొట్టిన కిక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మైదానానికి చాలా తక్కువ ఎత్తులో, ఇద్దరు జోర్డాన్ డిఫెండర్ల మధ్య నుంచి దూసుకెళ్లిన ఆ బంతి నేరుగా నెట్ ఎడమ మూలలోకి చేరింది. మెస్సీ కెరీర్లో ఫ్రీ కిక్ ద్వారా వచ్చిన 72వ గోల్ ఇది కాగా, అర్జెంటీనా జాతీయ జట్టు తరఫున ఫ్రీ కిక్‌తో కొట్టిన 12వ గోల్ కావడం విశేషం.
Lionel Messi becomes the first player to score in seven consecutive #FIFAWorldCup games 🌟 — FIFA World Cup (@FIFAWorldCup) June 28, 2026 ఈ అద్భుతమైన గోల్‌తో మెస్సీ తన అంతర్జాతీయ కెరీర్లో 202 మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మొత్తం 123 గోల్స్ సాధించాడు. ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్టియానో రొనాల్డో (145 గోల్స్) మొదటి స్థానంలో ఉండగా, మెస్సీ ఇప్పుడు రెండో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. ప్రపంచకప్ టోర్నమెంట్లలో మెస్సీకి ఇది మొత్తంగా 19వ వరల్డ్ కప్ గోల్ కావడం అతని క్లాస్‌కు నిదర్శనం.
రొనాల్డో పేలవ ప్రదర్శన.. పోర్చుగల్‌కు షాక్ మెస్సీ రికార్డులతో దూసుకుపోతుంటే, మరోవైపు అతని సమకాలీన స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఫామ్ ఈ 2026 వరల్డ్ కప్‌లో ఏమాత్రం ఆశాజనకంగా లేదు. రొనాల్డో ఈ టోర్నీలో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే కాకుండా, తాజాగా కొలంబియాతో జరిగిన మ్యాచ్‌లోనూ గోల్ కొట్టడంలో పూర్తిగా విఫలమయ్యాడు. కొలంబియాతో జరిగిన ఈ మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. పోర్చుగల్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించి, మిగిలిన రెండింటిని డ్రా చేసుకుంది. పాయింట్ల పట్టికలో కొలంబియా అగ్రస్థానంలో నిలవగా, పోర్చుగల్ రెండో స్థానంతో ఎలాగోలా రౌండ్ ఆఫ్ 32 నౌకౌట్ స్టేజ్‌కు అర్హత సాధించింది.
మరిన్ని ఆసక్తికర క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..