
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Woman attacks on hospital staff in lb nagar: ఇటీవల కొంతమంది మహిళలు సైతం తప్పతాగి న్యూసెన్స్ లు చేస్తున్నారు. ఒకప్పుడు మగాళ్లు తాగి రోడ్డు మీద హంగామా చేయడం, రాత్రిళ్లు షాపింగ్ మాల్స్, రోడ్లపై న్యూసెన్స్ చేయడం చూస్తుంటే వాళ్లం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కొంత మంది మహిళలు కూడా సైకోలాగా ప్రవర్తిస్తున్నారు. తామేం తక్కువ తిన్నామా..?.. అంటూ రచ్చ చేస్తున్నారు. రాత్రిళ్లు, పగలని తేడాలేకుండా ఎక్కడ పడితే హాంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ఒక మహిళ ఏకంగా ఆస్పత్రికి వెళ్లి నానా బీభత్సం చేసింది. ఏకంగా డ్యూటీలో ఉన్న స్టాఫ్ ల మీదనే దాడికి పాల్పడింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ - శ్రేష్ఠ ఆరెంజ్ హాస్పిటల్లో అర్ధరాత్రి ఒక మహిళ హల్ చల్ చేసింది. లలిత కరీర అనే మహిళ తనకు కడుపునొప్పి ఉందంటూ అత్యవసర విభాగoలో చేరింది. ఆమెకు డ్యూటీలో ఉన్న వైద్యులు అన్ని రకాల ప్రాథమిక చికిత్స అందించి పరీక్షలు నిర్వహించి, ఎలాంటి అనారోగ్య సమస్య లేదని చెప్పారు.
దీంతో వారిపై ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ తాను అబద్దం చెప్తానా..?.. అంటూ డ్యూటీలో ఉన్న డాక్లర్లపై, సిబ్బందిని దూషిస్తూ , కాలితో తన్నుతూ దాడికి దిగింది. ఈ క్రమంలో అక్కడున్న వారు ఎంతగా చెప్పిన ఆమె విన్పించుకోలేదు. ఆ తర్వాత మహిళ వారిపైన అరుస్తు.. TS 08 HG 9824 నంబర్ కారును స్వయంగా నడుపుకుంటూ వనస్థలిపురంలోని సహారా హాస్పిటల్‌కు వెళ్లినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బంది వెంటనే ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read more: Hyderabad: శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో చిరుత పులి సంచారం.. రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది..
పోలీసులకు సీసీ ఫుటేజీ సైతం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. డ్యూటీలో ఉన్న వైద్యులపై దాడి చేయడం ఏంటని నెటిజన్లు మండి పడుతున్నారు. ఆమె తప్పతాగి ఉందేమో అంటూ డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.