
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Leopard movement trigger in Warangal: ఇటీవల చిరుత పులులు ఎక్కువగా అడవి నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి పూట జంతువుల వేటలో భాగంగా అడవుల నుంచి సమీపంలోని ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండలం రాగంపేట గ్రామంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. చిరుత పులిని సంచారంను చూసిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు, ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందిచారు. ఈక్రమంలో ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
వరంగల్ జిల్లా ఖానాపూరంలో చిరుత పులి సంచారంతో జనాలు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. ముఖ్యంగా రాగంపేటలో ఉన్న ఒక రైసుమిల్లులోని సీసీ ఫుటేజీలో చిరుత పులి కదలికలు స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో ఆసమీపంలోని ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వెంటనే స్థానిక ప్రజలు అప్రమత్తమయ్యారు. దగ్గరలోని పామాయిల్ తోటలో కూడా చిరుత పులి పాదముద్రలు ఉన్నట్లు ఫారెస్ట్ సిబ్బంది గుర్తించారు.
సమాచారం అందగానే ఫారెస్ట్ అధికారులు చిరుత కన్పించిన ఘటన స్థలంకు చేరుకున్నారు. అక్కడ కన్పించిన పాదముద్రలను పరిశీలిస్తూ చిరుత సంచారాన్ని నిర్ధారించే ప్రయత్నం చేస్తున్నారు.
Read more: Hyderabad: ఎల్బీ నగర్ ఆస్పత్రిలో రెచ్చిపోయిన మహిళ.. డ్యూటీ డాక్టర్లపై దాడి చేస్తు అరాచకం.. వీడియో వైరల్..
ప్రజలు రాత్రి పూట అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా బైటకు రావొద్దని చెప్పారు. పశువుల్ని బయట వదిలేయకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని హెచ్చరించారు. అడవిలో మేతకు తమ పశువుల్ని పంపవద్దని చెప్పారు. ఈ క్రమంలో వరంగల్ ఖానాపూర్ పరిసర గ్రామ ప్రజలు మాత్రం నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ సిబ్బంది సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.