
అమరావతి: 3 రాజధానుల పేరుతో అమరావతిపై విషం చిమ్మిన జగన్ అండ్ కో నేడు రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక పోతున్నారని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి ధ్వజమెత్తారు.
అందుకే వైకాపా రౌడీ మూకలు నిన్న రాజధానిలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు పన్నారన్నారు. ఆ పార్టీ కుట్రల్ని అమరావతి రైతులు తిప్పికొట్టారని తెలిపారు. వైకాపా హయాంలో అమరావతి రైతులపై అక్రమ కేసులు, వేధింపులతో హింసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఏ మొహం పెట్టుకుని వైకాపా నేతలు రాజధానికి వెళ్తారని ప్రశ్నించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించామని.. రాజధానిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. జగన్ ఇంకా మావిగన్ అంటూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ వైఖరిలో ఏ మాత్రం మార్పు లేదన్నారు. జగన్ అండ్ కో కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. అమరావతి దేవతల రాజధాని అని.. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా ఏం చేయలేరని స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.