
ఇంటర్నెట్ డెస్క్: ఎలాంటి ప్రచారం, హంగామా లేకపోయినా ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన యాక్షన్ చిత్రం ‘బ్లాస్ట్: జోన్’. తెలుగులోనూ మంచి టాక్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీ రికార్డు వసూళ్లు రాబట్టింది.
కేవలం రూ.18 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ‘బ్లాస్ట్’ ఏకంగా రూ.74.85 కోట్లు వసూలు చేయడం గమనార్హం.
సుభాష్ కె.రాజ్ దర్శకత్వంలో అర్జున్ సర్జా (Arjun Sarja) హీరోగా నటించిన మార్షల్ ఆర్ట్స్ థ్రిల్లర్ ఇది. అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. మే 28న ఒక సాధారణ చిత్రంగా విడుదలై కేవలం మౌత్ టాక్‌తోనే సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలోకి (Blast movie ott release date) అందుబాటులోకి వచ్చినా, ఇంకా పలు చోట్ల ఈ మూవీకి ప్రేక్షకాదరణ తగ్గలేదు.
ఈ ఏడాది విడుదలైన తమిళ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా ‘బ్లాస్ట్’ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘కరుప్పు’ దాదాపు రూ.300 కోట్లకుపైగా వసూళ్లతో టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత పరాశక్తి రూ.80 కోట్లు వసూలు చేయగా, ఇప్పుడు బ్లాస్ట్ సుమారు రూ.75 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
94 ఏళ్ల వయసులోనూ కొత్తతరం ప్రేక్షకులను అలరించేందుకు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన చిత్రం ‘సింగ్ గీతం’.
ఇక సినిమాలు చేయనని రెండేళ్ల క్రితం సమంత తనతో చెప్పిందని ఆమె భర్త రాజ్ నిడిమోరు తెలిపారు.
రెండేళ్లు ఒంటరిగా ఇంట్లో ఉండి ఎన్నో కష్టాలు అనుభవించానని భావోద్వేగానికి గురయ్యారు నటి సమంత.