
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Ireland Vs India Playing 11: ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఎదురైన ఊహించని పరాజయం తర్వాత టీమిండియా మేనేజ్మెంట్ అప్రమత్తమైంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో నిలవాలంటే శనివారం జరగబోయే రెండో మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తుది జట్టులో మూడు కీలక మార్పులు చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.
భారత జట్టులో జరగబోయే ఆ 3 మార్పుల వివరాలు ఇవేనా? ప్రసిద్ధ్ కృష్ణపై వేటు.. తొలి మ్యాచ్‌లో భారత బౌలింగ్ దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా ఏకంగా 57 పరుగులు సమర్పించుకున్నాడు. డెత్ ఓవర్లలో పరుగులను నియంత్రించడంలో విఫలమవ్వడంతో, రెండో మ్యాచ్‌లో అతడిని పక్కనబెట్టి బెంచ్‌పై ఉన్న మరో ప్రతిభావంతుడైన యువ ఫాస్ట్ బౌలర్‌కు అవకాశం ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
వాషింగ్టన్ సుందర్ ఔట్? గత మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌గా నిరాశపరిచిన వాషింగ్టన్ సుందర్‌పై కూడా వేటు పడే అవకాశం ఉంది. తొలి వన్డేలో కేవలం ఒకే ఒక్క ఓవర్ వేసి 19 పరుగులు ఇచ్చిన సుందర్, బ్యాటింగ్‌లోనూ రాణించలేకపోయాడు. దీంతో స్పిన్ విభాగంతో పాటు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌ను బలోపేతం చేసేందుకు అతడి స్థానంలో మరో సమర్థుడైన ఆల్‌రౌండర్‌ను బరిలోకి దించనున్నారు.
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ? భారత బ్యాటింగ్ ఆర్డర్‌కు మరింత దూకుడును జోడించేందుకు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. పవర్‌ప్లేలో వేగంగా పరుగులు రాబట్టగల సూర్యవంశీని జట్టులోకి తీసుకుంటే, భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది పడుతుందని కెప్టెన్, కోచ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.