
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Employees New Health Scheme: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి ఆరోగ్యం అందించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు నిండు ఆరోగ్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆరోగ్య పథకాన్ని ప్రారంభించింది. ఉద్యోగ సంఘాలతో చర్చలు, సంప్రదింపులు చేసిన అనంతరం వారి అభిప్రాయాలు తీసుకున్న ప్రభుత్వం కొత్త ఆరోగ్య పథకాన్ని ప్రారంభించబోతున్నది. జూలై 15వ తేదీన ఉద్యోగులకు కానుక అందించనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్య పథకానికి సంబంధించి ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్టు సమావేశమైంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్త ఆరోగ్య పథకం ప్రారంభానికి ముహూర్తం నిర్ణయం తీసుకుంది. జూలై 15వ తేదీ నుంచి నూతన ఆరోగ్య పథకం ప్రారంభిస్తామని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లో సమగ్రమైన నిబంధనలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్యాకేజీ రేట్లు, ఆస్పత్రుల జాబితాను వచ్చే సమావేశంలో ఖరారు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
భార్యాభర్తల్లో ఒకరి నుంచి మాత్రమే చందా మినహాయింపు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో హాస్పిటల్ యాజమాన్య ప్రతినిధులతో ఆరోగ్య శాఖ అధికారులు, ట్రస్ట్ సభ్యుల సమావేశం కానుంది. ఈ సమావేశం అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నాక కొత్త ఆరోగ్య పథకాన్ని ప్రారంభం చేయనున్నారు. తమ ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త ఆరోగ్య పథకం ఎలా ఉంటుందనేది ఇప్పటివరకు ఉద్యోగులకు ఒక స్పష్టత రాలేదు.