
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్టైల్, స్వాగ్ చూస్తే థియేటర్లలో పేపర్లు ఎగరాల్సిందే, విజిల్స్ మోగాల్సిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) స్క్రీన్ మీద కనిపిస్తే ఆ కిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్టైల్, స్వాగ్ చూస్తే థియేటర్లలో పేపర్లు ఎగరాల్సిందే, విజిల్స్ మోగాల్సిందే. రీసెంట్ టైమ్స్‌లో పవన్ ఫ్యాన్స్‌కు ఆ స్థాయిలో పూనకాలు తెప్పించిన సినిమా ఏదైనా ఉందీ అంటే.. అది కచ్చితంగా ‘ఓజీ’ (OG Movie) అని ప్రతీ ఒక్కరు ఒప్పుకుంటారు. పవర్ స్టార్‌ను నెవర్ బిఫోర్ అనే రేంజ్లో చూపించి, తానొక వీరాభిమానిని అని డైరెక్టర్ సుజిత్ నిరూపించుకున్నారు. ముంబై మాఫియా బ్యాక్ డ్రాప్లో పవన్ కళ్యాణ్ లుక్స్, యాక్షన్ సీక్వెన్స్‌తో బ్లడ్ బాత్‌ను చూపించి ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్ ఇచ్చారు. అయితే మొదటి పార్ట్‌లో ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయో, అందులో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయన్నది ఫ్యాన్స్ సైతం గమనించే ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద సుజిత్ (Sujeeth) పెట్టిన శ్రద్ధ... కథ, స్క్రీన్‌ప్లే విషయంలో కాస్త తగ్గించారని, స్టోరీలో డెప్త్ మిస్ అయ్యిందనేలా విమర్శలు వచ్చాయి. కాకపోతే ఎలివేషన్ సీన్స్ ఆ రేంజ్లో పేలడంతో ఆ చిన్న చిన్న తప్పులు పెద్దగా కనిపించకుండా, సినిమా అలా నెట్టుకుపోయింది.
కానీ, ఇప్పుడు సీన్ మారింది. సుజిత్ ‘ఓజీ-2’ (OG 2)ను భారీ స్థాయిలోనే అనౌన్స్ చేశారు. పవన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే, ఈసారి సుజిత్ గతంలో చేసిన తప్పులను రిపీట్ చేయకూడదని గట్టిగా డిసైడ్ అయ్యారట. ఈ సారి కథ పరంగా కూడా సుజిత్ చాలా కేరింగ్ తీసుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మొదటి పార్ట్‌లో వచ్చిన కొన్ని మైనస్‌లను ఈ సారి రాకుండా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాడట. కేవలం ఎలివేషన్స్ మాత్రమే కాకుండా, బలమైన ఎమోషన్స్, సాలిడ్ విలనిజం ఉండేలా స్క్రిప్ట్‌ను పక్కాగా డిజైన్ చేస్తున్నాడట. పవన్ కళ్యాణ్ వంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోకి, ఒక స్ట్రాంగ్ స్టోరీ లైన్ కూడా పడితే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ వస్తుందో సుజిత్‌కు బాగా తెలుసు. అందుకే స్క్రిప్ట్ వర్క్ దగ్గరే డబుల్ చెక్ చేసుకుంటున్నాడనే టాక్ వినిపిస్తోంది.
ఇక వీటన్నింటికీ మించి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అసలైన న్యూస్ ఒకటి ఉంది. ఓజీ-2లో పవన్ కళ్యాణ్‌కు పెట్గా ఒక డ్రాగన్ ఉండబోతోందని. వినడానికే థ్రిల్లింగ్‌గా ఉన్నా దాన్ని సుజిత్ ఎలా డీల్ చేస్తాడనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్నే. హాలీవుడ్ స్థాయిలో ఈ విజువల్స్, వీఎఫ్ఎక్స్ను ప్లాన్ చేస్తున్నారట. ఇదే కనుక వర్కవుట్ అయితే ఇండియన్ స్క్రీన్ మీద ఇదొక కొత్త ట్రెండ్ సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. స్టోరీ లైన్ స్ట్రాంగ్‌గా ఉండి, సుజిత్ మార్క్ ఎలివేషన్స్, పవన్ యాక్షన్ ఎపిసోడ్స్ కరెక్ట్‌గా పడితే.. ‘ఓజీ-2’ బాక్సాఫీస్ దగ్గర సృష్టించే విధ్వంసాన్ని ఎవరూ ఆపలేరు. మరి ఈసారి సుజిత్ అంచనాలకు తగ్గట్టుగా సినిమాను ఇస్తాడా..? లేక అంచనాలను మించిపోయి హిస్టరీ క్రియేట్ చేస్తాడా? అన్నది చూడాలి.
Kamal Haasan: ఒకే నెలలో గురు శిష్యుల మరణం.. తమిళ పరిశ్రమ కన్నీరుమున్నీరు..
Naga Chaitanya: నా కెరీర్లో బెస్ట్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఆ హీరోయిన్‌తోనే
వెంకీ, త్రివిక్రమ్ ‘ఏకే 47’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే