
AP Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం నుంచి మధ్య మహారాష్ట్ర వరకు (తెలంగాణ మీదుగా) ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్రంలో వర్షాల ప్రభావం పెరగనుంది.
శని, ఆదివారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.