
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్నిచోట్ల మోకాళ్ల లోతు వరకు వాన నీరు చేరడంతో వాహనదారు
లు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ను వరద నీరు చుట్టుముట్టింది. కోనేరు సెంటర్ చెరువును తలపిస్తోంది. రోడ్లపై వాన నీటిని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ వార్త చదివారా: వైకాపా నేతల అమరావతి పర్యటన ఉద్రిక్తం