
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Cobra Inside Shoe Video Watch: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఎంతగానో నవ్వుపుట్టిస్తే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం చూసే ప్రతి ఒక్కరి ఆశ్చర్యపోవడం ఖాయం.. ఒక ఇంటి బయట విడిచిన షూ లోపల అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన బ్లాక్ కింగ్ కోబ్రా నక్కి కూర్చుంది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలిదు.. కానీ, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది..
సాధారణంగా వర్షాకాలం, చలికాలంలో లేదా వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చల్లదనం కోసం పాములు ఇలాంటి చీకటి ప్రదేశాలలో ఆశ్రయం పొందుతూ ఉంటాయి. ఈ ఘటనలో కూడా ఇలాగే ఉన్నట్లు తెలుస్తోంది. షూ లోపల స్థావరం ఏర్పరచుకున్న ఆ నల్లత్రాచు, ఎవరికీ కనిపించకుండా లోపల నక్కి ఉంది. సాధారణంగా ఆడవులకు దగ్గరగా ఉండే ప్రదేశాల్లో ఇళ్లు ఉన్నవారికి ఇలా జరగడం సర్వసాధారణం..
కదిలిస్తే ఊగిపోయిన కోబ్రా.. వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి కర్ర సహాయంతో ఆ షూను నెమ్మదిగా కదిలించడం మనం చూడవచ్చు. అలా కదిలించిన వెంటనే.. లోపల ఉన్న నల్లటి కింగ్ కోబ్రా తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఒక్కసారిగా షూ లోపలి నుంచి తన పడగను పైకి లేపి.. కెమెరా వైపు చూస్తూ భయంకరంగా బుసలు కొట్టడం మొదలు పెట్టింది.. ఆ పాము కోపం, దాని సైజు చూస్తుంటే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే.. ఒకవేళ అందులో పాము ఉందని గమనించకుండా ఎవరైనా నేరుగా అందులో కాలు పెట్టి ఉంటే.. ఎంత ఘోరంగా ఉండేదో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.. ఆ వ్యక్తి సకాలంలో గమనించి కర్రతో పరిశీలించడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
నెటిజన్ల కామెంట్లు.. ఈ వీడియోను ఇప్పటి వరకు చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించిన్నట్లు తెలుస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇకపై నేను షూ వేసుకునే ముందు వంద సార్లు చెక్ చేసుకుంటానని ఒకరు కామెంట్ చేయగా.. పాములు ఎక్కడ దాక్కుంటాయో చెప్పలేం.. కాబట్టి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మరొకరు రాసుకొచ్చారు. షూస్, చెప్పులను ఎప్పుడూ ఇంటి బయట పడేయకూడదని.. వీలైతే క్లోజ్డ్ షూ రాక్స్‌లో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే పాములు ఇలా చొరబడే అవకాశాలు కూడా ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.