
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది.
ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Telangana Rain Deficit: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లోని మర్రిగడ్డ గ్రామంలో రైతాంగం తీవ్ర ఆందోళనలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. సకాలంలో రుతుపవనాలు రాకపోవడంతో పాటు.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఇప్పటికే విత్తనాలు వేసిన రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. ఎండల తీవ్రతకు మొలకలు మాడిపోతుండడంతో.. పెట్టుబడి మట్టి పాలవుతుందేమోనని అన్నదాతలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి కరుణించాలని.. కరువు నుంచి రక్షించాలని కోరుతూ గ్రామస్తులు కప్పలకు సంబంధించిన పెళ్లిళ్ల లతో పాటు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు..
మర్రిగడ్డ గ్రామంలో శనివారం ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.. సాధారణంగా దసరా నవరాత్రుల్లో ఆడే బతుకమ్మను.. వర్షాలు సమృద్ధిగా కురవాలని ఏకైక సంకల్పంతో మహిళలు ముందుగానే పేర్చారు.. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న మహిళకు లేదా తో పాటు గ్రామ మహిళలు అందరూ ఏకమై ఈ నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.. రంగురంగు పూలతో బతుకమ్మను అందంగా అలంకరించి.. వాటితో పాటు నీటి కోరత తీరాలని సంకేతిస్తూ.. నీటి బిందెలను కూడా పూల మాలలతో ముస్తాబు చేశారు..
మహిళలంతా ఒకే చోట చేరి.. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ.. వానలు కురవాలి ఉయ్యాలో.. మా కష్టాలు తీరాలి ఉయ్యాలో అంటూ భక్తి శ్రద్ధలతో సామూహికంగా పాడిన పాటలు పల్లె గుండెలను కదిలించాయి.. తమ సుఖ సంతోషాల కంటే.. లోకానికి అన్నం పెట్టే రైతుల కష్టాలు తీరని ముఖ్యమని వరుణ దేవుడిని వేడుకున్నారు.. ఈ సమయంలో గ్రామంలో ఉన్న ప్రతి ఒక మహిళ వరుడిని వానలు సక్రమంగా కురవాలని బతుకమ్మ ఆడుతూ ప్రత్యేకమైన పూజలు చేసినట్లు తెలుస్తోంది.
ఈ వినూత్న కార్యక్రమం మర్రిగడ్డ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. పంచాయతీ ప్రతినిధులతో పాటు అధికారులు మహిళా కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని.. వ్యవసాయం బాగుంటేనే గ్రామం సురక్షితంగా ఉంటుందని బతుకమ్మల ఆడుతూ చాటి చెప్పారు.. పూజల అనంతరం సాంప్రదాయ పద్ధతుల్లో వరుణ యాగం తరహా ప్రార్థనలు చేసి, ప్రకృతి మాత కరుణిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ సమయంలో తీసిన కొన్ని వీడియోలు వైరల్‌గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.