కార్తీకదీపం సీరియల్‌తో వంటలక్కగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేమి విశ్వనాథ్ కు తిరుగులేని ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక డాక్టర్ బాబుగా నిరుపమ్‌కి కూడా బుల్లితెరపై స్టార్డం వచ్చింది.
బుల్లితెర శోభన్ బాబుగా నిరుపమ్‌కి లేడీ ఫాలోయింగ్ పెరిగింది. ప్రేమి విశ్వనాథ్, నిరుపమ్ జోడికి వచ్చిన ఆదరణను, క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు కార్తీకదీపం అయిన వెంటనే కార్తీకదీపం నవవసంతం అనే సీరియల్‌ను స్టార్ట్ చేశారు. ఇక మొదట్లో ఈ సీరియల్ మీద అంత ఇంట్రెస్ట్ జనాలకు కలగలేదు. కేవలం ఈ ఇద్దరి జోడి కోసమే సీరియల్‌ను చూశారంతా. కానీ అలా ముందుకు వెళ్తున్న కొద్దీ సీరియల్ మీద అందరికీ ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇప్పుడు కథ మంచి రసపట్టు మీద ఉంది.ఇప్పటికే 700ల ఎపిసోడ్స్ క్రాస్ చేసింది ఈ సీరియల్. ఇక ఈ క్రమంలో సెలెబ్రేషన్స్‌లో భాగంగా కార్తీకదీపం టీం అంతా కూడా శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో సందడి చేసింది. రేపు (జూన్ 28) ప్రసారం కాబోతోన్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన తాజా ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో కార్తీక్, దీప, జ్యోత్స్న చేసిన ఫన్ అదిరిపోయింది. ఇక వంటలక్క కొడుకు మను కూడా వీడియో కాల్ ద్వారా షోలో సందడి చేశాడు.తెలుగు రాకపోయినా తెలుగులో మాట్లాడేందుకు వంటలక్క కొడుకు ట్రై చేశాడు. స్టార్ మా తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అని తెలుగులో చెప్పాడు. మీ అమ్మకి ఫోన్ పిచ్చి ఉందా? అని శ్రీముఖి అడుగుతుంది. మా అమ్మ అస్సలు ఫోనే వాడదు.. నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయదు.. అని మను అంటాడు. దీంతో అందరూ నవ్వేస్తారు. నాకంటే కూడా వాడికి జిమ్‌లో ఉండటం, వర్కౌట్లు చేయడం ఇష్టం.. పైగా రాత్రి పూటే వర్కౌట్లు ఎక్కువగా చేస్తుంటాడు.. ఎందుకు రా అలా.. అలిసిపోవా? అని అడుగుతాను..లేట్ నైట్‌లో అమ్మాయిలు ఎక్కువగా ఉంటారు.. వారికి ట్రైనింగ్ ఇస్తాను అని చెబుతుంటాడు అని తన కొడుకు గురించి ప్రేమి విశ్వనాథ్ చెప్పారు. మీ మమ్మీ నిన్ను ఎప్పుడైనా కొట్టిందా? అని మనుని శ్రీముఖి అడుగుతుంది. చాలా సార్లు కొట్టింది.. ఏది దొరికితే దాంతో కొడుతుంది.. చైర్‌తో కూడా కొట్టింది అని మను అంటాడు. ఆ చెప్పులు, చీపురు కట్ట అని ప్రేమి విశ్వనాథ్ అంటుంది. దీంతో అందరూ నవ్వేస్తారు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా అని తెలుగులో ఎంతో ముద్దుగా చెప్పడంతో ప్రేమి విశ్వనాథ్ కన్నీరు పెట్టేసుకుంది.