
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.
అలాగే 2020లో తన ప్రియుడు, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు తన జీవితంపై ఎంతటి ప్రభావం చూపాయో కూడా ఆమె సుదీర్ఘంగా వివరించింది.
నేహా ధూపియా నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానెల్లో తన సోదరుడుతో కలిసి పాల్గొన్న రియా, ప్రేమ, వివాహం, అలాగే గత కొన్నేళ్లుగా తమ కుటుంబం ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడింది.
జీవితంలో తోడు కోసం చూడడం లేదా అని అడిగిన ప్రశ్నకు రియా స్పందిస్తూ, ఈ సమయంలో తనకు ప్రత్యేకంగా ఎలాంటి కోరికలు లేవని తెలిపింది.
“ప్రస్తుతం నాకు ప్రత్యేకంగా ఏదైనా కావాలనే కోరిక లేదు. కానీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మంచి తోడు ఉంటే బాగుంటుంది,” అని ఆమె పేర్కొంది. .
తాను, తన కుటుంబం ఎదుర్కొన్న మానసిక వేదన గురించి కూడా రియా మాట్లాడింది. ఆ అనుభవాలు తన జీవిత దృక్పథాన్ని, సంబంధాల పట్ల ఉన్న అవగాహనను పూర్తిగా మార్చేశాయని ఆమె చెప్పింది. అందుకే, మళ్ళీ లవ్ లో పడడం, లాంగ్ రిలేషన్ కోసం తొందరపడదల్చుకోలేదు అని అంటోంది. ఇకపై అటువైపు అడుగు వేస్తే అది ఏడడుగులకు దారి తీయాలి అనే భావనలో ఉన్నట్లు ఉంది.తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు