
ఈ ఆసనం ధనుస్సును పోలి ఉంటుంది. అందుకే ఆ పేరు. చేసే విధానం: ముందుగా బోర్లా పడుకోవాలి. చేతులూ, కాళ్లను విశ్రాంతంగా ఉంచండి. నెమ్మదిగా మోకాళ్లను మడచి, చేతుల్ని వెనక్కి తీసుకుని చీలమండల్ని పట్టుకోండి.
ఊపిరి పీల్చుతూ ఛాతీని నేల నుంచి పైకి లేపండి. ఇదే క్రమంలో కాళ్లను సైతం తొడ భాగం వరకూ పైకి తీసుకురండి. మొత్తం శరీరం ఉదరభాగంపైనే ఆధారపడి ఉంటుంది. ఆపై సాధారణ శ్వాసలు చేస్తూ ఆసన స్థితిలో ఉండండి. ముఖ భాగంలో ఎలాంటి బిగింపు లేకుండా విశ్రాంతిగా ఉండండి. 15-20 సెకన్ల తర్వాత ఆసనం వీడి శవాసనంలో విశ్రాంతి పొందండి.
ఉపయోగాలు: వెన్నుకు బలాన్ని ఇస్తుంది. హర్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. పునరుత్పత్తి అవయవాలకు మంచిది. పీరియడ్స్ సమస్యల్ని పరిష్కరిస్తుంది. మూత్ర పిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
జాగ్రత్తలు: వెన్ను సర్జరీలు అయినవాళ్లు, గర్భిణులు ఈ ఆసనం వేయరాదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.