మన దేశంలోని నగరాలు ప్రతిరోజూ కొండంత తడి వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి. మన కిచెన్‌లో వచ్చే వ్యర్థాలను డస్ట్‌బిన్‌లో వేసి మున్సిపాలిటీ చెత్త బండిలో వేసేస్తుంటాం.
మన వంటింటి వ్యర్థాలు ఆ డంపింగ్‌లో కుళ్లే ప్రాసెస్‌లో మీథేన్ గ్యాస్, లీచేట్ను రిలీజ్ చేస్తాయి. ఇవి గాలిని, నీటిని కలుషితం చేస్తాయి. అదే మన ఇంట్లోనే వంటగది వ్యర్థాలను కంపోస్ట్ చేస్తే 90% వరకు గృహ వ్యర్థాలను డంపింగ్ యార్డులకు వెళ్లకుండా మళ్లించవచ్చు. అంతేకాదు మన ఇంట్లో, బాల్కనీలో పెంచుకునే మొక్కలను కంపోస్ట్‌ను మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని రీసెర్చ్‌గేట్ అధ్యయనం పేర్కొంది. దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. మట్టిని గుల్లగా ఉంచుతుంది. కిచెన్ వేస్ట్ కంపోస్టింగ్ వల్ల వ్యర్థాల సమస్య పరిష్కారం కావడమే కాకుండా మన మొక్కలకు కావలసిన ఎరువు కూడా ఫ్రీగా వచ్చేస్తుంది. అంతేకాకుండా మన వంటకు కావలసిన కూరగాయలు, ఆకు కూరలు కూడా మంచిగా పండించుకోవచ్చు. అంటే ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం మీ వంట గది వ్యర్థాలను కంపోస్గా మార్చడాని కంపోస్టింగ్ బిన్ కచ్చితంగా ఉండాలి. కిచెన్ వేస్ట్‌ను ఎలా మ్యానేజ్ చేయాలో ఈ స్టోరీలో చూద్దాం..కూరగాయల తొక్కలు, వ్యర్థాలుకిచెన్ వేస్ట్‌లో మేజర్ పార్ట్ కూరగాయల వ్యర్థాలదని చెప్పొచ్చు. కూరగాయల తొక్కలు, చివర్లు, కొద్దిగా కుళ్లిన కూరగాయలు, పుచ్చిన కూరగాయలు, పాడైన కూరగాయలను డస్ట్ బిన్లో వేయకుండా కంపోస్ట్ బిన్లో వేయండి. ఇది రూల్‌గా పెట్టుకోండి. ఒకవేళ కంపోస్ట్ బిన్ లేకపోతే, మీ బాల్కనీ మొక్కల మొదళ్లలో ఈ వేస్ట్ వేయండి. లేకపోతే కొంచెం మట్టి పైకి తీసి ఈ తొక్కలు దానిలో వేసి పూడ్చేయండి. ఇలా చేస్తే ఎలాంటి వాసన కూడా రాదు. కాఫీ పొడిఫిల్టర్ కాఫీ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా సౌత్ ఇండియన్స్‌కు కాఫీ అంటే ప్రాణం అని చెప్పాలి. ఫిల్టర్ కాఫీ తయారు చేసేప్పుడు కాఫీ పొడి వ్యర్థం వస్తుంది. ఆ పొడిని వేస్ట్‌గా చెత్త బుట్టలో పాడేయకుండా మీ మొక్కలకు వేయండి. ఈ పొడిలో మొక్కలకు ఎంతో అవసరమైన నైట్రోజన్ ఉంటుంది. అంతేకాకుండా పొటాషియం, ఫాస్ఫరస్, ఇతర సూక్ష్మపోషకాలు కూడా ఉంటాయి. ఈ పోషకాలు మీ మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడతాయి. అంతేకాకుండా మొక్కలను చీడపీడల నుంచి కూడా రక్షిస్తాయి. కాఫీ పొడిని ఎండబెట్టి మొక్కలకు ఇవ్వొచ్చు. లేదా సింపుల్‌గా కంపోస్ట్ బిన్లో వేయండి. అది కంపోస్ట్‌గా మారిన తర్వాత మొక్కలకు ఎరువుగా ఇవ్వొచ్చు.గుడ్డు పెంకులుగుడ్డులో పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే మనలో చాలా మంది గుడ్డును తరచుగా తింటూ ఉంటారు. గుడ్డు పెంకులను మీ డస్ట్‌బిన్‌లో వేయకుండా కంపోస్ట్ బిన్లో వేయండి. గుడ్డు పెంకులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది మొక్కల పెరుగుదలకు, కూరగాయలు బాగా కాయడానికి సహాయపడుతుంది. గుడ్డు పెంకులను శుభ్రం చేసి, పొడిగా చేసి మొక్కల మొదట్లో కొంచెం కొంచెం వేయవచ్చు. ఇది మొక్కలకు అద్భుతం చేస్తుంది. కార్డ్బోర్డ్ పెట్టెలు..ఫుడ్ డెలివరీలు, ఈ - కామర్స్ ఇలా రకరకాల కారణాల వల్ల ఇంట్లో కార్డ్బోర్డ్ పెట్టెలు పోగుబడి పోతాయి. ఆ తర్వాత వాటిని చెత్త బుట్టలో వేసేస్తాం. కార్డ్బోర్డ్ పెట్టెలు కంపోస్ట్ తయారీకి అద్భుతంగా సహాయపడతాయి. ఇవి తడి చెత్తలోని తడిని పీల్చుకుని కంపోస్ట్ త్వరగా రెడీ అయ్యేలా చేస్తాయి. మీరు ప్రింటింగ్ లేని కార్డ్బోర్డ్ బాక్సులను చిన్నచిన్న ముక్కలుగా చేసి కంపోస్ట్ బిన్లో లేయర్‌గా వేయండి.ఇవి కంపోస్ట్ బిన్లో వేయవద్దుఇంట్లో కంపోస్ట్ తయారు చేసుకునే వారిని ఎక్కువగా ఇబ్బందిపెట్టే సమస్యలు దుర్వాసన, పురుగులు, కీటకాలు. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి మాంసం, చేపలు, ప్లాస్టిక్, మెటల్స్, నూనెలు మీ కంపోస్ట్‌లో వేయవద్దు. ఈ పదార్థాలను మీ కంపోస్ట్ వాసన వచ్చేలా చేస్తాయి. దానిని కలుషితం చేస్తాయి. కూరగాయలు, పండ్ల వ్యర్థాలు, గుడ్డు పెంకులు, పేడ వంటివి మాత్రమే కంపోస్ట్‌లో వేయాలి. మీరు కంపోస్ట్‌లో మట్టి, ఎండు ఆకులు, కొంత మజ్జిగ కలిపితే కంపోస్టింగ్ ప్రాసెస్ త్వరగా అవుతుంది.ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.