
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం(Adarsha Kutumbam) సినిమాతో బిజీగా ఉన్న విక్టరీ వెంకటేష్(Venkatesh), ఆ తర్వాత అనిల్ రావిపూడి(Anil...
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం(Adarsha Kutumbam) సినిమాతో బిజీగా ఉన్న విక్టరీ వెంకటేష్(Venkatesh), ఆ తర్వాత అనిల్ రావిపూడి(Anil Ravipudi)తో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత ఆయన మరో ఇంట్రెస్టింగ్ డైరెక్టర్ తో చేతులు కలపబోతున్నారనే ప్రచారం టాలీవుడ్లో జోరుగా సాగుతోంది. బింబిసార(bimbisara), విశ్వంభర(Vishwambhara) వంటి భారీ విజువల్ కాన్సెప్ట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వశిష్ట(Vassishta)తో వెంకటేష్ తర్వాతి సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిగినట్లు సమాచారం.
ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్(Suresh Productions)తో పాటు నిర్మాత నల్లమలపు బుజ్జి(nallamalapu bujji) సంయుక్తంగా నిర్మించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఈ కలయిక వెనుక మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) కీలక పాత్ర పోషించారనే వార్తలు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. వశిష్ట చెప్పిన కథ వెంకటేష్‌కు బాగా సరిపోతుందని భావించిన చిరంజీవి, ఈ కాంబినేషన్‌ను ప్రోత్సహించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.
వశిష్ట సినిమాల్లో కనిపించే ఫాంటసీ, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను వెంకటేష్‌కు తగ్గట్టుగా కొత్తగా మలచే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించే వెంకటేష్ ఇమేజ్‌కు భిన్నంగా, అదే సమయంలో ఆయన బలాలను హైలైట్ చేసే కథను వశిష్ట రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తయ్యాక ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన వస్తే ఈ క్రేజీ కాంబోపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.