
Hero Passion+ | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero motocorp) తన పాపులర్ 100 సీసీ మోటార్ సైకిల్ ప్యాషన్+ (Hero Passion+)ను డిస్క్‌బ్రేక్ వేరియంట్లో...
Hero Passion+ | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero motocorp) తన పాపులర్ 100 సీసీ మోటార్ సైకిల్ ప్యాషన్+ (Hero Passion+)ను డిస్క్‌బ్రేక్ వేరియంట్లో తీసుకొచ్చింది. దీని ధరను రూ.84,128 (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. 100 సీసీ సెగ్మెంట్లో హీరో అందిస్తున్న స్ప్లెండర్+, హెచ్ఎఫ్, ప్యాషన్+ బ్రాండ్లలో ఖరీదైన మోటార్ సైకిల్ ఇదే కావడం గమనార్హం. ప్యాషన్+లో 97.2 సీసీ ఎయిర్‌కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 8000 ఆర్పీఎం వద్ద 8 హెచ్‌పీ పవర్‌ను, 6000 ఆర్పీఎం వద్ద 8.05 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.
ఇందులో ఐ3ఎస్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ ఇచ్చారు. ఈ మోటార్ సైకిల్ గరిష్ఠంగా లీటరుకు 71 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ముందువైపు 240 ఎంఎం డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ డిస్ప్లే ఇచ్చారు. దీని ద్వారా కాల్, ఎస్సెమ్మెస్ అలర్ట్‌లు పొందొచ్చు. రియల్‌టైమ్ మైలేజీ ఇండికేటర్, లో ఫ్యూయల్ వార్నింగ్ వంటివీ తెలుసుకోవచ్చు. సైడ్ స్టాండ్ కటాఫ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్టు వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. రెడ్, బ్లూ, బ్లాక్, గ్రే కలర్స్‌లో లభిస్తుంది. ప్రస్తుతం 100 సీసీ సెగ్మెంట్లో స్ప్లెండర్ ఎక్స్‌టెక్‌లో మాత్రమే డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.