
మీరు చేయాల్సిందిల్లా సెట్టింగ్స్‌లోకి వెళ్లి వాట్సాప్ ప్లస్ అని మార్చుకుంటే సరిపోతుంది అంతే.. ఈ కొత్త ప్లస్ సర్వీసు కోసం మెటా యూజర్ల నుంచి నెలకు రూ.79 చార్జ్ వసూలు చేస్తోంది.
ప్రస్తుతం వాట్సాప్ ప్లస్ అందించే ఫీచర్లలో కొత్తగా ఏమి యాడ్ అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం వాట్సాప్ చాట్ బాక్సులో కేవలం 3 గ్రూప్స్ వరకు మాత్రమే పిన్ చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే, ఈ ప్లస్ సర్వీసు తీసుకున్న యూజర్లకు మాత్రం 20 గ్రూప్స్ పిన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు.. వాట్సాప్ లోగోను కూడా మనకు ఇష్టమైన కలర్ మార్చుకునే వీలుంది.
Read Also : Best Budget Cars : పెట్రోల్ టెన్షన్‌కు గుడ్‌బై.. రూ. 3.50 లక్షల్లో 5 బెస్ట్ మైలేజ్ కార్లు.. 34కి.మీ మైలేజ్ పక్కా..!
చాట్ లోపల ఉండే టెక్ట్స్ బబుల్స్, మెసేజ్ టిక్స్, బ్యాక్‌గ్రౌండ్ అన్ని యాక్సస్ చేసుకోవచ్చు. అలాగే, వాల్పేపర్లలో కూడా మీరు ఎంచుకునే థీమ్ ఆధారంగా మార్చుకునే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా థీమ్, రింగ్‌టోన్, నోటిఫికేషన్ టోన్ సెట్ ఇలా ప్రతిదీ మనకు నచ్చిన విధంగా మార్చుకునేందుకు వీలుంటుంది.
ప్లస్ ఫీచర్ ద్వారా ఇంకా మరెన్నో ఫీచర్లను కూడా పొందవచ్చు. యానిమేటెడ్ స్పెషల్ స్టిక్కర్లు కూడా యాక్సస్ పొందవచ్చు. స్పెషల్ రింగ్ టోన్లను కూడా ఈజీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వాట్సాప్ ప్లస్ సబ్ స్క్రిప్షన్ వద్దని అనిపిస్తే కూడా మీరు ఎప్పుడైనా ఈజీగా క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ కూడా అందిస్తుంది.