
ఇంటర్నెట్ డెస్క్: ఉప్పల్ వేదికగా టీజీ20 లీగ్ మ్యాచ్‌లో వరంగల్ వారియర్స్‌ను నల్గొండ నైట్స్ చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌లో నల్గొండ 259/5 స్కోరు చేసింది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో వరంగల్ 14 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. దీంతో వరంగల్‌పై 91 పరుగుల తేడాతో నల్గొండ ఘన విజయం సాధించింది. కెప్టెన్ అమన్ రావు (46), మురుగన్ అభిషేక్ (44), భవేశ్ సేథ్ (22) దూకుడుగా ఆడారు. అయితే, మిగతా బ్యాటర్లలో హర్షిత్ చౌధరి (10), మణి కిరణ్ (16), అసిఫ్ (5), శౌనక్ (4), ముదాస్సర్ (5), పల్లెపాటి క్రాంతి (5) విఫలమయ్యారు.
టాస్ ఓడిన నల్గొండ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. ఓపెనర్ గౌరవ్ రెడ్డి (81: 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు), నితీశ్ రెడ్డి (81: 41 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. కెప్టెన్ రాహుల్ బుద్ధి (31: 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), అర్ఫాజ్ అహ్మద్ (33: 14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. ఆఖర్లో దివేశ్ సింగ్ ( 18*) వేగంగా పరుగులు రాబట్టాడు. వరంగల్ బౌలర్లలో అబ్దుల్ మాలిక్ 2.. ముదాస్సర్, శౌనక్ చెరో వికెట్ తీశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: టీజీ20 లీగ్‌లో వరంగల్ వారియర్స్ - నల్గొండ నైట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ 259/5 స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆ ఫొటోలను మీరూ చూసేయండి..