
బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'తస్కరి: ది స్మగ్లర్స్ వెబ్' (Taskari: The Smugglers Web).
ఎయిర్పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే స్మగ్లింగ్ నెట్వర్క్, కస్టమ్స్ అధికారుల మైండ్ గేమ్స్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. అంటే ఎయిర్‌పోర్ట్‌లలో నిషేధిత వస్తువులను, బంగారాన్ని కేటుగాళ్లు ఎలా స్మగ్లింగ్ చేస్తారో ఈ సిరీస్ లో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. గతంలో 'ఎ వెడ్నెస్ డే', 'స్పెషల్ ఓపీఎస్', 'ఎమ్ఎస్ ధోని' లాంటి రియల్ స్టోరీలను తెరకెక్కించిన డైరెక్టర్ నీరజ్ పాండే ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఈ ఏడాది జనవరిలో నెట్‌ఫ్లిక్స్ లో 'తస్కరి: ది స్మగ్లర్స్ వెబ్' సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. అప్పటి నుంచి ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ఇస్తూ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రికార్డులు కొల్లగొడుతోందీ వెబ్ సిరీస్. ఏకంగా 20 వారాలుగా ఇండియా టాప్ 10 ట్రెండింగ్ లిస్ట్‌లో నాన్‌స్టాప్‌గా కొనసాగుతోంది. ఒక వెబ్ సిరీస్ ఈ రేంజ్లో దాదాపు ఐదు నెలల పాటు టాప్ చార్ట్స్‌లో ట్రెండ్ అవ్వడం ఓటీటీ హిస్టరీలోనే ఒక అరుదైన మైల్ స్టోన్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఐఎండీబీలో ఈ సిరీస్ కు 7.1 రేటింగ్ ఉంది.
'తస్కరి: ది స్మగ్లర్స్ వెబ్' వెబ్ సిరీస్‌లో ఇమ్రాన్ హష్మీ కస్టమ్స్ ఆఫీసర్ అర్జున్ మీనా అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. ఇక బంగారం స్మగ్లింగ్ చేసే బడా చౌదరి పాత్రలో శరద్ కేల్కర్ యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. వీరితో పాటు అనురాగ్ సిన్హా, జమీల్ ఖాన్, ఫ్రేడీ దారూవాలా, జోయా అఫ్రోజ్, నందీష్ సింగ్ సంధు, అమృతా ఖాన్విల్కర్ తదితరులు ఈ సిరీస్ లో వివిధ పాత్రల్లో కనిపించారు. ఈ వారం కూడా 'తస్కరీ' సిరీస్ నెట్‌ఫ్లిక్స్ ఇండియా చార్ట్స్‌లో 8వ స్థానంలో ట్రెండ్ అవుతుండడం విశేషం. వీకెండ్ లో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ చూడాలనుకుంటున్నారా? అయితే మీకు 'తస్కరి: ది స్మగ్లర్స్ వెబ్' ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. హిందీతో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
Fasten your seatbelts. Taskaron, prepare for a rough landing kyunki ab sab kuch scan hoga 🚨💰 Watch Taskaree: The Smuggler’s Web, out 14 January, only on Netflix.#TaskareeOnNetflix — Netflix India (@NetflixIndia) January 7, 2026 మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.