
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Shani pradosh 2026 shani dev puja and remedies: జ్యోతిష్య పండితుల ప్రకారం నవగ్రహాలు మనిషి జీవన గమనాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. అంతే కాకుండా శని భగవానుడు చాలా శక్తివంతమైన గ్రహం. ఆయన మనం చేసుకున్న మంచి, చెడు కర్మలను బట్టి ఫలితాలు ఇస్తారు. ఈ క్రమంలో శనివారం రోజున త్రయోదశి కలిసి రావడం చాలా అరుదైనదిగా చెప్తారు. ఈ రోజున సాయంత్రం చాలా మంది శని ప్రదోష వ్రతంను కూడా ఆచరిస్తారు. అసలు శనీశ్వరుడి ప్రదోష వ్రతం ఏంటో ఇప్పుుడు తెలుసుకుందాం. శనిశ్వరుడు పేరులోనే.. శనిదేవుడు, ఈశ్వరుడు రెండు పేర్లుకలిసి ఉన్నాయి.
శనివారం రోజు బ్రాహ్మీమూహుర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించి దేవుడిని యథాశక్తి పూజించుకొవాలి. ఇంట్లో లేదా గుడిలో దీపం పెట్టి పూజలు చేయాలి. ఈ రోజున ఉదయం నుంచి సాయత్రం వరకు శక్తి ఉంటే ఉపవాసం చేయాలి. లేకుంటే పండ్లు, టిఫిన్ అయిన తిని ఉపవాసం ఉండవచ్చు.
సాయంత్రం వేళ మరల శుచీగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి సూర్యుడు అస్తమించేసమయంలో అంటే.. 5. 50 నిముషాల నుంచి 6.30 నిముషాల వరకు సమయంను ప్రదోష వ్రతం అంటారు. ఈసారి మనం శనీవారం జూన్ 27న శనీ ప్రదోష వ్రతం చేసుకుంటాం. ఆ సమయంలో శనీశ్వరుడు అంటే.. శనిదేవుడితో పాటు శివుడ్ని ప్రత్యేకంగా పూజించుకొవాలి. శివుడికి ప్రత్యేకంగా సాయంత్రం పూట ఆలయాలలోకి వెళ్లి పంచామృతాలతో అభిషేకం చేయించుకొవాలి.
అంతే కాకుండా అన్న పూజలు కూడా చేయించుకొవాలి. ఈ విధంగా పూజించుకున్న తర్వాత నైవేద్యం సమర్పించాలి. బిల్వపత్రాలను, భస్మంను స్వామి వారికి సమర్పించాలి. ఈ విధంగా పూజలు చేసిన తర్వాత ఆరతి ఇచ్చి పూజలను ముగించుకొవాలి. ఆ తర్వాత చంద్రోదయం తర్వాత రాత్రి పూజ భోజనం చేయాలి. రాత్రి పూట శనిభగవానుడు లేదా శివుడి కీర్తనలు, భజనలు చేయాలి. శివుడి విగ్రహం పాదరసం లేదా పార్థివ లింగంను చాలా శక్తివంతమైనదిగా చెప్తారు.
Read more: Shani trayodashi 2026: శక్తివంతమైన శనిత్రయోదశి... రేపు శని దోషాల నివారణకు ఏంచేయాలంటే..?
ఈ విధంగా ప్రత్యేకంగా సాయంకాలం పూట చేయడంను శనిప్రదోష వ్రతం అని పిలుస్తారు. ఈ విధంగా చేస్తే శనీశ్వరుడికి దోషాల ప్రభావంనుంచి సులభంగా బైటపడవచ్చు. అన్ని రకాలు శుభాల్ని కూడా ఈ శని ప్రదోష వ్రతం చేస్తే లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.