
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Tata Nexon vs Maruti Dzire vs Skoda: భారతదేశ మార్కెట్లో ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది. గత కొన్నాళ్లుగా దేశంలో సురక్షితమైన కార్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. దేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే కార్ల భద్రతను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2003లో భారత NCAP ను ప్రారంభించింది. మీరు మీ కుటుంబం కోసం 6 నుంచి 10లక్షల లోపు అత్యంత సేఫ్టీ కారు కోసం చూస్తున్నట్లయితే ఈ 5 కార్ల గురించి తెలుసుకోండి.
టాటా ఆల్ట్రోజ్: టాటా ఆల్ట్రోజ్.. ఈ కారు 5స్టార్ రేటింగ్ తో దేశంలో అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఆల్ట్రోజ్ ధర కేవలం 6.30లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది ప్రయాణికుల రక్షణతో పాటు పిల్లలకు రక్షణ రెండింట్లోనూ 5 స్టార్ రేటింగ్ ను సాధించింది. ఆల్ట్రోజ్ ఏఓపి లో 32 కి 29.65 పాయింట్లు, సీఓపీలో 69కి 44.90 పాయింట్లు సాధించింది
టాటా పంచ్ ఈవీ: టాటా పంచ్ ఈవి 2026 భారత మార్కెట్లోకి విడుదలైంది. 5 స్టార్ రేటింగ్ తో తక్కువ ధరకే అందుబాటులో ఉన్న కారు ఇది. 5-స్టార్ BNCAP రేటింగ్ పొందింది. ఈ కారు ధర 6.49 వేల నుంచి లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఏఓపిలో 32 పాయింట్లకు 31.46 పాయింట్లు పిల్లల సేఫ్టీలో 49 పాయింట్లకు 45 పాయింట్లు సాధించింది. దీని ఎక్స్ షోరూం ధర 9.69 లక్షలుగా ఉంది.
మారుతి సుజుకి డిజైర్: నాలుగో జనరేషన్ మారుతి డిజైర్ నవంబర్ 2024లో భారత మార్కెట్లోకి విడుదలైంది.ఈ కారు అత్యంత ప్రజాదరణ పొందింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఈ కారును ఎక్కువ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారు 5స్టార్ రేటింగ్‌ను పొందింది. దేశంలో డిజైర్ ధర 7.18 లక్షలు గా ఉంది. ఇది భద్రతలో 32 పాయింట్లకు 29.4 పాయింట్లు.. పిల్లల సేఫ్టీలో 49 పాయింట్లకు 41.57. సాధించింది.
టాటా నెక్సాన్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడుపోయే కార్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. దీనికి 5 స్టార్ రేటింగ్ కూడా ఉంది. దేశంలో నెక్సాన్ ధర కేవలం రూ.7.36లక్షల నుండి ప్రారంభమవుతుంది . నెక్సాన్ సేఫ్టీలో 32 పాయింట్లు గాను 29.41 పాయింట్లు సాధించింది. సిఓపిలో 49 పాయింట్లు గాను, 43.83 పాయింట్లు సాధించింది
స్కోడా కైలాక్: ఈ జాబితాలో చివరి కారు స్కోడా కైలాక్. ఈ కారు బి మ్యాక్ క్రాస్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ పొందింది. దేశంలో కైలాక్ ధరలు 7.59 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఈ కారు AOPలో 32 పాయింట్లకు గాను 30.88 పాయింట్లను.. COPలో 49 పాయింట్లకు గాను 45 పాయింట్లను సాధించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.