
హైదరాబాద్‌లోని సనత్ నగర్లో ఉన్న కల్ట్ ఫిట్ జిమ్‌లో మహిళలకు లైంగిక వేధింపులు జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఫిట్నెస్ కోసం జిమ్‌కు వచ్చిన మహిళలను లక్ష్యంగా చేసుకుని ట్రైనింగ్ పేరుతో వేధింపులకు...
హైదరాబాద్‌లోని సనత్ నగర్లో ఉన్న కల్ట్ ఫిట్ జిమ్‌లో మహిళలకు లైంగిక వేధింపులు జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. ఫిట్నెస్ కోసం జిమ్‌కు వచ్చిన మహిళలను లక్ష్యంగా చేసుకుని ట్రైనింగ్ పేరుతో వేధింపులకు పాల్పడిన ఇద్దరు ట్రైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా పైలెట్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి రాగా, దర్యాప్తు లో మరో నలుగురు మహి ళలు కూడా ఇదే తరహా వేధింపులకు గురైనట్లు పోలీసులు గుర్తించారు.
కల్ట్ ఫిట్ ఫిట్నెస్ మేనేజర్ సంతోష్ ట్రైనింగ్ పేరుతో మహిళా పైలెట్‌కు దగ్గరవ డానికి ప్రయత్నించాడు. వ్యక్తిగతంగా కలుసుకోవా లని, తనతో ఒక రాత్రి గడపాలని పదేపదే ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు అతని ప్రతిపాదనలను తిరస్కరించడంతో వేధింపులు మరింత పెరిగినట్లు ఆమె తన ఫిర్యాదు లో పేర్కొది. అంతేకాకుండా, తన గర్ల్‌ఫ్రెండ్ రజినీతో కలిసి ముగ్గురం కలిసి ప్రైవేట్‌గా గడపడం తన "ఫాంటసీ" అంటూ అసభ్యకర ప్రతిపాదనలు చేసినట్లు మహిళా పైలట్ తన ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలు అంగీకరించక పోవడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర సందేశాలు పంపుతూ మానసికంగా వేధించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో సంతోష్‌కు మరో ట్రైనర్ హరీష్ సహకరించినట్లు గుర్తించిన పోలీసులు అతనినీ కూడా అరెస్ట్ చేశారు. బాధిత మహిళా పైలెట్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇదే జిమ్‌కు వచ్చిన మరో నలుగురు మహిళలు కూడా ఇలాంటి వేధింపులకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. జిమ్‌లలో మహిళల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.
విద్యావ్యవస్థలో మార్పునకు ఉపాధ్యాయులే నాయకులు : మంత్రి లోకేష్
శ్రీ చరణి ప్రభంజనం...ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్
.