
ఇంటర్నెట్ డెస్క్ - తాజా సమాచారం: భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రయోగం ఫలించింది. శివమ్ దూబేను రంగంలోకి దింపగా.. తొలి బంతికే వికెట్ తీశాడు. దూబే వేసిన 7.
1 ఓవర్లో బెంజమిన్ (15) భారీ షాట్‌కు యత్నించాడు. బౌండరీ లైన్ వద్ద ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా ఒడిసిపట్టాడు. దీంతో 51 పరుగుల వద్ద ఐర్లాండ్ నాలుగో వికెట్‌ను నష్టపోయింది.
హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. తన వరుస ఓవర్లో మరో వికెట్ తీశాడు. ఐర్లాండ్ ఓపెనర్ టిమ్ టెక్టర్ (17)ను పెవిలియన్‌కు పంపాడు. హర్షిత్ వేసిన 3.4వ ఓవర్లో షాట్‌కు యత్నించి మిడాఫ్‌లో శ్రేయస్‌కు టెక్టర్ దొరికిపోయాడు. దీంతో 30 పరుగుల వద్ద ఐర్లాండ్ మూడో వికెట్‌ను నష్టపోయింది. ప్రస్తుతం ఐర్లాండ్ స్కోరు 4 ఓవర్లకు 30/3.
ఐర్లాండ్‌కు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. హర్షిత్ రాణా వేసిన బంతిని (1.5వ ఓవర్) ఆడబోయిన ఓపెనర్ రాస్ అడైర్ (12) వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 20 పరుగుల వద్ద ఐర్లాండ్ తొలి వికెట్‌ను నష్టపోయింది. మూడో ఓవర్ చివరి బంతికి హ్యారీ టెక్టర్ (0)ను అర్ష్‌దీప్ పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం ఐర్లాండ్ స్కోరు 3 ఓవర్లకు 25/2. క్రీజ్‌లో లొర్కాన్ టక్కర్, టిమ్ టెక్టర్ ఉన్నారు.
అంతర్జాతీయ క్రికెట్లోకి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఆలస్యం కానుంది. ఐర్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌కు ప్రకటించిన తుది జట్టులో అతడికి అవకాశం లభించలేదు. దీంతో అతడి అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. మొదటి మ్యాచ్‌లో టాస్ నెగ్గిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకుని ఐర్లాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా వైభవ్ అరంగేట్రం చేస్తాడని ఈ సందర్భంగా శ్రేయస్ తెలిపాడు.
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఐర్లాండ్: టిమ్ టెక్టర్, రాస్ ఆడైర్, హ్యారీ టెక్టర్, లోర్కన్ టకెర్ (కెప్టెన్/వికెట్ కీపర్), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రేయ్స్, జ మూండ్రా, మాథ్యూ హోలార్డ్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: టీజీ20 లీగ్‌లో వరంగల్ వారియర్స్ - నల్గొండ నైట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన నల్గొండ 259/5 స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఆ ఫొటోలను మీరూ చూసేయండి..