
IND vs IRE : భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభమైంది. బెల్ఫాస్ట్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది.
టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ ద్వారా వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగ్రేటం చేస్తాడని చాలా మంది భావించారు. అయితే.. అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. 'ముందుగా ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. బెల్ఫాస్ట్లో ఆడటం మాకు ఇదే మొదటిసారి. కాబట్టి ఇక్కడి పిచ్ మాకు కొత్త. పరిస్థితులు, వాతావరణం, పిచ్ స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాం. ఆటగాళ్లందరూ తమ సహజ శైలిలోనే ఆడాలని, ఆటలో పట్టుదల, దూకుడు ప్రదర్శించాలని సూచించాను. పరిస్థితులకు వీలైనంత త్వరగా అలవాటు పడాల్సి ఉంది. మేము ఒక్కో మ్యాచ్‌పైనే దృష్టి సారిస్తాం. విషయాలను అనవసరంగా క్లిష్టం చేసుకోకూడదని ఎప్పుడూ చెబుతుంటాను. దురదృష్టవశాత్తు.. అతను (వైభవ్ సూర్యవంశీ) ఆడటం లేదు.అతను అద్భుతమైన ఆటగాడు. కానీ మా జట్టులో గత కొన్ని సిరీస్‌లలో భారత్ తరపున అద్భుతంగా రాణించిన అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి, ఈ సీజన్ అంతటా అద్భుతంగా ఆడుతున్న ఆటగాళ్లకే మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. సరైన సమయం వచ్చినప్పుడు అతనికి అవకాశం లభిస్తుంది. ప్రస్తుతానికి మేము ముగ్గురు స్పెషలిస్ట్ సీమర్లు, ఒక ఆల్‌రౌండర్‌తో బరిలోకి దిగుతున్నాం.' అని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. Vaibhav Sooryavanshi : ఈ రోజు బుడ్డోడికి పీడ కలే.. వైభవ్ సూర్యవంశీ అరంగ్రేటం పై ఐర్లాండ్ కెప్టెన్ కామెంట్స్ 🚨 Toss 🚨#TeamIndia have won the toss and elected to bowl in the 1️⃣st T20I. Updates ▶️ — BCCI (@BCCI) June 26, 2026 'టాస్ గెలిచి ఉంటే మేము బౌలింగ్ ఎంచుకునే వాళ్లం. పిచ్ చాలా బాగున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం జట్టు పరివర్తన దశలో ఉంది. గత రెండేళ్లుగా స్టెర్లో జట్టును అద్భుతంగా నడిపించాడు. ఈ రోజు జై అరంగేట్రం చేస్తున్నాడు. 'అని ఐర్లాండ్ కెప్టెన్ టక్కర్ తెలిపాడు. ఐర్లాండ్ తుది జట్టు.. టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్(కెప్టెన్), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై మూండ్రా, మాథ్యూ హోలార్డ్ భారత తుది జట్టు.. అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ Here is how #TeamIndia lines up for the 1️⃣st T20I against Ireland 📝 Updates ▶️ — BCCI (@BCCI) June 26, 2026