
Philippines Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లోని మిందనౌ ప్రాంతాన్ని శుక్రవారం మరో భారీ భూకంపం వణికించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 6.
Another massive earthquake in the Philippines and 6.5 magnitude on the Richter scale.
Philippines Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లోని మిందనౌ ప్రాంతాన్ని శుక్రవారం మరో భారీ భూకంపం వణికించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 6.5గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) వెల్లడించింది. భూ అంతర్భాగంలో 29 కిలోమీటర్ల లోతున ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
IAS Transfers: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. తెలంగాణలో 13 మంది ఐఏఎస్ ల బదిలీ
తీవ్రమైన భూప్రకంపనల(Philippines Earthquake) నేపథ్యంలో తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సునామీ ముప్పును నివారించేందుకు తక్షణమే సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, కొన్ని వారాల క్రితమే ఇక్కడ సంభవించిన మరో భూకంపంలో 80 మందికి పైగా మృతి చెందడం గమనార్హం.