
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Sach The Subhash Chandra Show: మీడియా రంగ దిగ్గజం, జీ గ్రూప్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు అయిన డాక్టర్ సుభాష్ చంద్ర తన పాపులర్ టాక్ షో "సచ్: ది సుభాష్ చంద్ర షో" (Sach: The Subhash Chandra Show) మూడవ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జీ మీడియా సమర్పిస్తున్న ఈ సరికొత్త సీజన్ జూన్ 28వ తేదీ నుండి ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు జీ న్యూస్‌తో పాటు జీ నెట్‌వర్క్‌లోని అన్ని ఛానళ్లలో ప్రసారం కానుంది. డిజిటల్ ప్రేక్షకులకు ZEE5 ఓటీటీలోనూ ఇది అందుబాటులో ఉంటుంది.
ఈ సీజన్ ప్రత్యేకత ఏంటి? (కళాశాలల నుండి పల్లెల వరకు..) గత సీజన్లలో కేవలం విద్యా సంస్థలు, నగరాల యువతపైనే దృష్టి పెట్టిన ఈ షో, ఇప్పుడు తన పరిధిని మరింత విస్తరించింది. ఈసారి చిన్న పట్టణాలు, నగరాలు, గ్రామీణ భారతదేశంలోని సామాన్యుల గళానికి ఈ షో పెద్దపీట వేయబోతోంది. పల్లెటూళ్ల నుండి పుట్టుకొచ్చిన స్థానిక ఆవిష్కరణలు, సామాజిక మార్పులు, స్ఫూర్తిదాయక విజయ గాథలను దేశానికి పరిచయం చేయనున్నారు.
వయసుతో సంబంధం లేకుండా.. అటు నూతన ఆలోచనలతో దూసుకుపోయే యువతను, ఇటు పదవీ విరమణ తర్వాత జీవితంలో సంక్లిష్ట సమస్యలను ఎదుర్కొనే పెద్దలను ఈ వేదికపైకి తీసుకురానున్నారు.
చర్చకు రానున్న కీలక అంశాలు.. మారుతున్న ప్రపంచంలో విద్యార్థులు, యువత, వ్యాపారవేత్తలకు సరైన దిశానిర్దేశం చేయడం కోసం ఈ క్రింది అంశాలపై లోతైన చర్చలు జరగనున్నాయి. టెక్నాలజీ & ఎడ్యుకేషన్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), విద్య, భవిష్యత్ వృత్తులు (Future Careers) వంటి వాటిపై చర్చ జరగనుండగా.. బిజినెస్ & లీడర్షిప్ వైపు స్టార్టప్‌లు/వ్యవస్థాపకత, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ స్కిల్స్.. అలాగే లైఫ్ & సొసైటీ రంగాల్లోని ఆధ్యాత్మికత, నైతిక విలువలు, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి వంటి వాటిపై చర్చ జరగనుంది.
మీ జీవితానికి డాక్టర్ సుభాష్ చంద్రే 'సారథి' ఈ మూడవ సీజన్లో అత్యంత ఆకర్షణీయమైన అంశం 'సారథి' (Sarthi) అనే సరికొత్త డిజిటల్ వేదిక. దీని ద్వారా ప్రజలు నేరుగా డాక్టర్ సుభాష్ చంద్రతో కనెక్ట్ అవ్వవచ్చు. దశాబ్దాల వ్యాపార, సామాజిక అనుభవం ఉన్న ఆయన.. జీవితంలోని కీలక మలుపుల్లో గందరగోళానికి గురయ్యే వారికి ఒక 'సారథి'లా ఆచరణాత్మకమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తారు.
ఎలా సంప్రదించాలి? ఆసక్తి ఉన్నవారు వెబ్సైట్ ద్వారా ఆయన ఆలోచనలతో, అనుభవాలతో నేరుగా అనుసంధానం కావచ్చు.
"మీ ప్రయాణంలో నేను తోడుంటాను" - డాక్టర్ సుభాష్ చంద్ర ఈ షో గురించి డాక్టర్ సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. "సచ్ సీజన్ 3 ఇప్పుడు మీ నగరాలకు, మీ పెద్ద కలలకు విస్తరిస్తోంది. మీ కలలకు రెక్కలు తొడగడానికి మీ దగ్గర ఒక వినూత్నమైన ఆలోచన ఉన్నా, లేదా జీవితంలో, వ్యాపారంలో మీరు ఏ దశలోనైనా ఇబ్బందుల్లో చిక్కుకున్నా.. ఈ ప్రయాణంలో మీకు 'సారథి'గా తోడుండటమే నా లక్ష్యం" అని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.