
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
AP Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం నుంచి మధ్య మహారాష్ట్ర వరకు (తెలంగాణ మీదుగా) ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్రంలో వర్షాల ప్రభావం పెరగనుంది. శని, ఆదివారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.
శనివారం (27-06-2026) వాతావరణం.. ఉత్తరాంధ్రతో పాటు కింది జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి వాటిలో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందట.
అలాగే కోస్తాఆంధ్రాలోని కాకినాడ, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.
ఆదివారం (28-06-2026) వాతావరణం.. ఆదివారం నాడు కింది జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయట.
ప్రజలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. వర్షాలు, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రమాదాల బారిన పడకుండా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో భారీ చెట్ల కింద, హోర్డింగ్స్ (ఫ్లెక్సీలు) కింద లేదా బలహీనమైన షెడ్ల కింద నిలబడకూడదు.
విద్యుత్ ప్రమాదాలు: ఈదురుగాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటికి దూరంగా ఉండాలి. తక్షణమే అధికారులకు సమాచారం అందించాలి.
రైతులకు సూచన: ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశుకాపరులు చెట్ల కింద ఉండకుండా వెంటనే సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.