
– టీపీయూఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అనంతుల లక్ష్మీనారాయణ కొత్తగూడెం, జూన్ 26 : తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం (TPUS) రాష్ట్ర సంస్థాగత అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో...
– టీపీయూఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అనంతుల లక్ష్మీనారాయణ
కొత్తగూడెం, జూన్ 26 : తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం (TPUS) రాష్ట్ర సంస్థాగత అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పద్మశాలి ఉద్యోగుల సదస్సులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సదస్సులో సంఘ ఐక్యతను మరింత బలోపేతం చేయడం, పద్మశాలి ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, సేవా కార్యక్రమాల విస్తరణ వంటి అంశాలపై రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసింది. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అనంతుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, రాష్ట్రస్థాయి సదస్సులు సంఘ బలోపేతానికి, ఉద్యోగుల మధ్య ఐక్యత పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులతో అభిప్రాయాల మార్పిడి ద్వారా సంఘాన్ని మరింత బలోపేతం చేసే అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. సదస్సును విజయవంతంగా నిర్వహించిన రాష్ట్ర కమిటీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దూలం నట్రాజ్, సంస్థాగత కార్యదర్శి పసునూతి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షురాలు కొండి పద్మజ, సంయుక్త కార్యదర్శి వన్నాల విద్యాసాగర్, నిర్వాహక కార్యదర్శి బాతాల వెంకటేశ్వర్లు, క్రియాశీలక సభ్యురాలు కొండి విజయలక్ష్మి పాల్గొన్నారు.