
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ హైటెక్ సిటీలోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వైద్యుల సత్వర పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఈ వార్త తెలియగానే పలువురు వైసీపీ సీనియర్ నేతలు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈరోజు ఆసుపత్రికి వెళ్లారు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల నుంచి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ముద్రగడ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం పట్ల వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.