
నెలకు రూ.7 లక్షల జీతం వస్తే జీవితం సెట్ అయిపోతుందని చాలా మంది భావిస్తారు. కానీ, అంత వేతనం వచ్చినా చేతిలో ఎంత మిగులుతుందన్నదే అసలు ప్రశ్న అని ఓ డచ్-ఇండియన్ జంట చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో...
నెలకు రూ.7 లక్షల జీతం వస్తే జీవితం సెట్ అయిపోతుందని చాలా మంది భావిస్తారు. కానీ, అంత వేతనం వచ్చినా చేతిలో ఎంత మిగులుతుందన్నదే అసలు ప్రశ్న అని ఓ డచ్-ఇండియన్ జంట చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.చాంటల్, గురు అనే దంపతులు భారత్లో నెలకు రూ.40 వేల జీతం, స్విట్జర్లాండ్లో దాదాపు రూ.7 లక్షల వేతనం పొందే వారి నెలవారీ ఖర్చులను పోలుస్తూ వీడియో రూపొందించారు. జీతాన్ని మాత్రమే చూసి నిర్ణయం తీసుకోవద్దని, జీవన వ్యయం కూడా అంతే ముఖ్యమని అందులో వివరించారు.వీరి లెక్కల ప్రకారం భారత్లో నెలకు రూ.20 వేల అద్దె చెల్లించే ఇంటికి, స్విట్జర్లాండ్లో దాదాపు రూ.2 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే కిరాణా సరకులకు రూ.8 వేల బదులు రూ.80 వేలు, ఆరోగ్య బీమాకు రూ.500 బదులు రూ.50 వేలు, ప్రజా రవాణాకు రూ.2 వేల బదులు రూ.12 వేలు, పిల్లల సంరక్షణకు రూ.5 వేల బదులు రూ.1.5 లక్షలు ఖర్చవుతాయని వీడియోలో వివరించారు.ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. ‘‘ఎక్కువ జీతం వచ్చినంత మాత్రాన భారీగా డబ్బు మిగులుతుందని అనుకోవడం తప్పు’’ అని కొందరు వ్యాఖ్యాచారు. మరికొందరు రోడ్లు, గాలి నాణ్యత, భద్రత, వైద్య సేవలు, జీవన ప్రమాణాలను కూడా పోల్చాలని సూచించారు.దీనికి స్పందించిన చాంటల్, గురు.. ప్రస్తుతం తాము కేవలం ఆర్థిక అంశాలనే పోల్చామన్నారు. జీవన ప్రమాణాలపై కూడా భవిష్యత్లో వీడియోలు చేస్తామని తెలిపారు. మొత్తంగా జీతం కంటే నెలాఖరులో