
నేడు భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ వైభవ్ సూర్యవంశీ అరంగ్రేటం చేసే ఛాన్స్ ఐర్లాండ్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు Vaibhav Sooryavanshi : టీమ్ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ...
నేడు భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ వైభవ్ సూర్యవంశీ అరంగ్రేటం చేసే ఛాన్స్ ఐర్లాండ్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు Vaibhav Sooryavanshi : టీమ్ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగ్రేటం కోసం యావత్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం బెల్ఫాస్ట్ వేదికగా భారత్, ఐర్లాండ్ జట్లు తొలి టీ20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ద్వారా వైభవ్ అరంగ్రేటం చేస్తాడని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్ఇండియా లాంటి బలమైన జట్టులో కేవలం 15 ఏళ్లు ఉన్న వైభవ్ సూర్యవంశీ చోటు దక్కించుకోవడం నిజంగా అద్భుతం అని అన్నాడు. అతడు అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాడు అని మెచ్చుకున్నాడు. 'ఈ సిరీస్‌లో అతడు ఆడతాడని ఆశిస్తున్నాం. ఈ రోజు అతడు అరంగ్రేటం చేస్తాడని అనుకుంటున్నాం. అయితే.. అతడికి ఈ రోజును పీడకలగా మిగులుస్తాం. అతడిని తక్కువ స్కోరుకే ఔట్ చేసి అతడి అరంగ్రేటాన్ని మధుర స్మృతిగా మిగలనీయం. ఇలా చేస్తే మాత్రం మేము ఎంతో సంతోషిస్తాం.' అని మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ అన్నాడు. Sanju Samson : ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. సంజూ శాంసన్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు.. ఇక ఈ సిరీస్‌లో కీలక ఆటగాళ్లు జోష్ లిటిల్, మార్క్ అడైర్, బ్యారీ మెక్‌కార్తీ, కర్టిస్ క్యాంఫర్, పాల్ స్టర్లింగ్, జోర్డాన్ నీల్ అందుబాటులో లేకపోయినా.. స్వదేశ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని భారత జట్టుకు గట్టి పోటీ ఇస్తామని టక్కర్ వెల్లడించారు. వైభవ్‌కు చోటు దక్కేనా? ఐర్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ చోటు దక్కించుకోవడం అంత సులభం కాదు. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి సీనియర్ ఆటగాళ్లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ 2026 గెలవడంలో వీరంతా కీలక పాత్ర పోషించారు. వైభవ్ కు చోటు ఇవ్వాలంటే వీరిలో ఒకరిని పక్కన పెట్టాల్సి ఉంది. ఒకవేళ అలా సాధ్యం కాకుంటే ఇంగ్లాండ్‌తో సిరీస్ వరకు అరంగ్రేటం కోసం వైభవ్ వెయిట్ చేయకతప్పదు.