నూనెతో 5 నిమిషాల పాటు తల మసాజ్ చేయండి. దీని వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది.
సల్పేట్లు, ఇతర రసాయనాలు ఎక్కువగా ఉన్న షాంపూలు వాడితే జుట్టు పొడిబారుతుంది. కాబట్టి రసాయనాలు లేని షాంపూ వాడండి. దీంతో జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.
గరుకుగా ఉండే టవల్స్‌తో తల తుడుచుకోవడం వల్ల జుట్టు రాలే అవకాశం ఉంది. కాబట్టి మృదువైన టవల్స్ వాడండి. దీంతో జుట్టుకు డ్యామేజీ కలగదు.
తడి జుట్టు బలహీనంగా ఉంటుంది. తడి జుట్టును దువ్వడం వల్ల జుట్టు రాలే ప్రమాదం తీవ్రం అవుతుంది. జుట్టు పూర్తిగా ఆరిన తర్వాత దువ్వండి.
టైట్‌గా ఉండే జడలు వేయడం వల్ల కుదుళ్ల దగ్గర ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల జుట్టు రాలే ప్రమాదం ఉంది. కాబట్టి టైట్ జడలు వద్దు.
హీట్ స్టైలింగ్ ఎక్కువగా చేయడం వల్ల కూడా జుట్టు రాలుతుంది. హెయిర్ డ్రైయర్స్, స్ట్రైట్నర్స్ ఎక్కువగా వాడితే జుట్టు నిర్జీవంగా మారుతుంది.
కలబంద గుజ్జు, ఉల్లిపాయ రసం, మెంతుల పేస్ట్ వంటి వాటిని తలకు రాయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
ఐరన్, విటమిన్ డి, బయోటిన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. సంతులిత ఆహారం తీసుకుంటే జుట్టు బలంగా మారుతుందని క్లీవ్‌లాండ్ క్లీనిక్ రిపోర్ట్ తెలిపింది.
ఒత్తిడి పలు సమస్యలకు కారణం అవుతుంది. ఒత్తిడి పెరగడం వల్ల జుట్టు బలహీనంగా మారుతుంది. జుట్టు రాలడం ఎక్కువ అవుతుంది. ఒత్తిడి తగ్గేందుకు ధ్యానం చేయండి.