
తల్లిదండ్రులు అపురూపంగా నిర్మించుకున్న ఇంటిపై మమకారం పెంచుకున్న కుమారుడు.. ఆ సౌధాన్ని కూల్చి కొత్త నిర్మాణం చేయడానికి ఇష్టపడలేదు.
అయితే, రోడ్డు కంటే ఇల్లు పల్లంగా ఉండటంతో వర్షపు నీరు చేరి ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జాకీలు పెట్టి ఇంటి ఎత్తు పెంచి సమస్యకు పరిష్కారం చూపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన దూబగుంట్ల వెంకటేశ్వరరావు స్థానికంగా కిరాణా ఏజెన్సీ నడుపుతున్నాడు. ఆయన తండ్రి 1985లో ఇంటిని నిర్మించగా.. కుమారుడు అదే ఇంటిపై పదేళ్ల కిందట మరో అంతస్తు వేసి అందులోనే ఉంటున్నారు. ఇంటి ముందు వెళ్తున్న రహదారి ఎత్తుగా ఉండి, ఇల్లు పల్లంగా మారడంతో వర్షపు నీరు వచ్చి చేరడం ప్రారంభమైంది. దీంతో వెంకటేశ్వరరావు ఇంటి ఎత్తు పెంచాలనే ఆలోచన చేశారు. సుమారు 40 మంది కార్మికులతో 600 జాకీలను ఉపయోగించి ఇంటిని 5 అడుగుల వరకు ఎత్తు పెంచారు. ఈ వార్త చదివారా: మీకు తెలుసా.. తాయ్ చి వాక్!