
హనుమకొండ చౌరస్తా, జూన్ 26 : కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ(కుడా)లో అవినీతి కుంభకోణంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసన సభ్యుడు దాస్యం...
హనుమకొండ చౌరస్తా, జూన్ 26 : కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ(కుడా)లో అవినీతి కుంభకోణంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసన సభ్యుడు దాస్యం వినయ్‌భాస్కర్ మండిపడ్డారు. శుక్రవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాడిందే పాడు పాసుపళ్ల దాసు అన్న తీరుగా రెండున్నరేళ్లుగా ఏది జరిగినా మాపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు తుపాకి రాముళ్ల లాగా మాట్లాడుతున్నారు. ఇక్కడ అడ్డిమార్గుడ్డి దెబ్బలో గెలిచిన వ్యక్తి కొడతా, పొడుస్తా, తీస్తా అంటు పొడుగు పొడుగు మాటలు మాట్లాడుతూ, ఒక ప్రజాప్రతినిధిగా ఉండాల్సిన కనీస లక్షణాలు లేకుండా చిల్లర మాటలు మాట్లాడుతున్నారని వినయ్‌భాస్కర్ మండిపడ్డారు.
420 హామీలు, 6 గ్యారంటీ లు హామీ అమలు మరిచారు, కుడా పేరిట అభివృద్ధి మరిచి అవినీతికి తెరలేపారన్నారు. కుడా పేరిట అవినీతి జరుగుతోందని, అవినీతికి సహకరించాలని అధికారులపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. అధికారులపై ఒత్తిడి పెరుగుతుందని, మా వాళ్లు వస్తారు ఈ ధరకు ఫిక్స్చేయాలని ముందుగానే ఎక్కువ ధర పాడకుండా చూడాలని ముందే చెప్పుతున్నారని వాపోయారు. 30 మంది వేలం పాటలో పాల్గొంటే 10 మాత్రమే పాడటంపై అవినీతి జరిగిందని మండిపడ్డారు. బహిరంగ మార్కెట్లో ఆ స్థలంలో గజం ధర 1,50,000 కాగా కేవలం 66 వేలకే వేలం వేయడంపై వినయ్‌భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్లాట్ల వేలంలో సీబీఐ, ప్రభుత్వ విచారణ జరిపించాలన్నారు. అధికార పార్టీ నాయకుల అధికార దుర్వినియోగం జరిగిందని కాంగ్రెస్ అభివృద్ధిని అటకెక్కించారు.. అవినీతిని పోషిస్తున్నారని వాపోయారు. ప్రపంచం అంతా ఆన్లైన్లో చేస్తుంటే కుడా వేలం ఆఫ్‌లైన్ జరిగిందని, కుడా ప్లాట్ల వేలంలో అవినీతి జరిగిందని వెంటనే కుడా వేలాన్ని రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీలపై కేసులు, దాడులు, కూల్చివేతలు, బెదిరింపులు కాకుండా మిగిలిన రెండున్నరేళ్లలో అభివృద్ధి పై దృష్టి పెట్టాలని హితవు పలికారు.చెరువును చట్టాలకు విరుద్ధంగా పూడ్చివేస్తున్నారు.
వాల్టా యాక్ట్‌కు తూట్లు పొడుస్తున్నారని, వైల్డ్ లైఫ్ యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను విస్మరించారన్నారు.
యాదవ్‌నగర్-రెడ్డిపురం మార్గంలో ఉన్న చెరువును చట్టాలకు విరుద్ధంగా పూడ్చివేస్తున్నారని వినయ్‌భాస్కర్ మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇల్లు కచ్చితంగా స్థానికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించినం దుకు గుండాలతో దాడులు, అక్రమ కేసులకు భయపడేది లేదని, ప్రజల పక్షాన ఖచ్చితంగా పోరాడుతామని వినయ్‌భాస్కర్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్, మైనార్టీ కమిషన్ మాజీ సభ్యులు దర్శన్‌సింగ్, మాజీ కార్పొరేటర్లు సోదా కిరణ్, బొంగు అశోక్‌యాదవ్, జోరిక రమేష్, కుసుమ లక్ష్మీనారాయణ, నాయకులు నయీమొద్దీన్, పులి రజినీకాంత్, బొళ్లపల్లి పున్నంచందర్, నార్లగిరి రమేష్, సల్వాజి రవీందర్రావు, గండు అశోక్‌యాదవ్, గౌస్‌ఖాన్, శ్రీధర్, అఫ్జల్, రామ్మూర్తి, ప్రభాకర్, గండ్రకోట రాకేష్‌యాదవ్, శివకుమార్, షాబాద్, ఎస్కే మహమూద్, ఫెరోజ్, శ్యామ్‌రెడ్డి, మనోజ్, కనకరాజు, నాయిని రవియాదవ్, తక్కళ్లపల్లి వినీల్‌రావు, శ్రీకాంత్‌చారి, కీర్తి కిరణ్ బంటి పాల్గొన్నారు.