
టీజీ20 లీగ్‌లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జోరు కొనసాగుతోంది. కెప్టెన్ అభిరథ్‌రెడ్డి (99; 45 బంతుల్లో 10×4, 6×6) అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించాడు.
రంగారెడ్డి రైజర్స్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18 ఓవర్లలోనే ఛేదించిన హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు రంగారెడ్డి రైజర్స్‌కు టోర్నీలో తొలి ఓటమి ఎదురైంది. ఈ వార్త చదివారా: వైభవ్‌కు చోటుందా?