
ఇంటర్నెట్ డెస్క్: హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ నాలుగు డ్రోన్లతో దాడి చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆరోపించారు. ఆ డ్రోన్లలో ఒకటి..
అత్యంత ఖరీదైన సరకు రవాణా నౌకను బలంగా ఢీకొట్టిందని అన్నారు. నష్టం జరిగినప్పటికీ.. అది తన ప్రయాణాన్ని కొనసాగించిందని తెలిపారు. మరో 3 డ్రోన్లను తాము కూల్చివేశామని అన్నారు. ఇరాన్ (Iran) తెలివితక్కువ పని చేసిందని.. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఆరోపిస్తూ ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు.
మరోవైపు, సుంకాలకు సంబంధించి ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా కంపెనీల డిజిటల్ సేవలపై పన్ను విధిస్తే.. ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 100శాతం పన్ను వేస్తానని హెచ్చరించారు. వారితో వాణిజ్య ఒప్పందాలు అమల్లో ఉన్నా.. ఇప్పటికే సంతకం చేసినా.. చేయకున్నా.. వాటిపై సుంకాలు తప్పవన్నారు. కొన్ని ఐరోపా దేశాలు అమెరికా కంపెనీలపై పన్ను విధించే అంశాన్ని చర్చిస్తున్నాయని పేర్కొంటూ.. ట్రంప్ ఈ హెచ్చరికలు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.